Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు చెబుతున్నారు.. కానీ, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికా 50 శాతం సుంకం విధిస్తే కూటమి మాట మాత్రం కూడా స్వందించడం లేదు.. దేశ ఆత్మ గౌరవం ప్రమాదంలో పడిందన్నారు.. ఆక్వా రంగం పూర్తిగా దెబ్బ తింటుంది.. ఎగుమతులు కుదెలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యుత్, ఫీడ్, సీడ్ రేట్లు పై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. గార్మెంట్స్ లో 18వేల ఉద్యోగాలు పోయాయి.. ఉద్యోగాలు ఇస్తామని చెపుతూ.. ఉన్న ఉద్యోగాలను కాపాడలేకపోతున్నారు.. స్పీన్నింగ్ మిల్స్ విద్యుత్ రేట్లు కారణంగా 35 శాతం పరిశ్రమలు మూత పడ్డాయి.. రైతులకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Telangana Local Quota: సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు.. నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్..
ఇక, 2023లో వైజాగ్ లో మీటింగ్ పెట్టిన పవన్ కల్యాణ్ ఆవేశ పూరిత ఉపన్యాసం చేశారు.. ఐదేళ్లు గతంలో దీక్షలు చేస్తే.. ఇప్పుడు దీక్షలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు.. కార్మికులు ధర్నా చేయడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు.. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆగిపోయిందని అబద్ధాలు చెబుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఇచ్చిన 11 వేల కోట్లు ప్రతి రూపాయ లెక్క చెప్పాలి.. అప్పుడు మీ బండారం బయటపడుతుంది.. 500 కోట్ల మినహా మిగతా సొమ్మంతా జీఎస్టీ పేరుతో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆరోపించారు.. స్టీల్ ప్లాంట్‌లో 46 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు.. కానీ, పల్లా శ్రీనివాసరావు అబద్ధాలతో దగా చేస్తున్నారు.. గతంలో కాంట్రాక్టర్స్ మ్యాన్ పవర్ మాత్రమే సరఫరా చేసేవాళ్లు.. ఇప్పుడు మొత్తం విభాగం మెయింటినెన్స్ ఇచ్చేస్తున్నారు.. ప్రైవేటీకరణ దొడ్డి దారిన కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికులు ప్రతిఘటనలు చేస్తుంటే కార్మికుల సంఘాల పైన నాయకుల పైన పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని.. ఇది సరికాదన్నారు. కేంద్రం రాష్ట్రం కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని చూస్తున్నారు.. 33 వేల కోట్లు పునరావశంకి ఇవ్వాలి.. కానీ కేటాయించింది 900.. అదికూడా 400 కోట్లే ఇచ్చారు.. స్వయంగా చంద్రబాబు పరిశీలించి పునరావాసం పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..