కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.. ఓవైపు, ఎస్పీ, బీఎస్పీలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, యూపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రియాంకాగాంధీ.. అయితే, యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత.. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్.. కాంగ్రెస్ పార్టీకి […]
ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్‌ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్‌లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన […]
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్డౌన్ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్‌లో లాక్డౌన్ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్ కర్ఫ్యూను […]
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను […]
రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.. పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది తెలంగాణ కేబినెట్.
కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్‌తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్ వైరస్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్‌లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.. […]
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ… భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి.. ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు రానున్నారు.. రాత్రికే అక్కడే బసచేసి.. 11వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు ఎన్వీ రమణ.. కాగా, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తర్వాత కూడా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని […]
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. ఓవైపు టెస్టుల సంఖ్య పెంచినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగా తగ్గుతూ వస్తోంది… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,33,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1,897 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 15 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,982 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.. […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులకు శుభవార్త చెప్పింది… మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు, రెసిడెంట్ స్పెషలిస్టులకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ వైద్యారోగ్యశాఖ… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం… సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ. 70 వేలు , రెసిడెంట్ డెంటిస్టులకు రూ. 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు రూ. 85 వేల మేర వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది… […]
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. 75 శాతం తాము కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామని.. మిగతా 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఇస్తామన్నారు.. ఇక, టీకా వేసేందుకు మాత్రం రూ.150 మించి వసూలు చేయరాదని కూడా స్పష్టం చేశారు ప్రధాని.. కానీ, ఇవాళ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు […]