ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. వరుసగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, గజేంద్రసింగ్ షెకావత్‌లను కలిసిశారు.. ఆ తర్వాత నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌తో భేటీ అయ్యారు.. పలు అభివృద్ధి అంశాలపై చర్చ సాగింది.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం… రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించినట్టు తెలిపారు.. ఇళ్ల పట్టాల […]
అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణీకి గెనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను సురక్షితంగా బయటకు తీసారు. శిశువుకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సిజేరియన్ తర్వాత ఆరోగ్యంతో […]
కాంగ్రెస్ అధిష్ఠానంపై వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత అన్నారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు విశ్వాసమున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌లోని కీలక నేత జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద మిగిలిన అన్నింటికన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం […]
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనే కాదు తన శవం కూడా భారతీయ జనతా పార్టీలో చేరదన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద తాజాగా బీజేపీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద నిర్ణయం వ్యక్తిగతం అంటూనే.. ఇన్నేళ్లు వ్యతిరేకించిన పార్టీలో ఎలా చేరతారంటూ ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై లేఖ రాసిన నేతల్లో కపిల్ సిబల్ కూడా ఒకరు.. అలాంటి […]
భూముల విక్రయానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. దీని కోసం కమిటీలు ఏర్పాటు చేసింది.. సీఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే, భూముల అమ్మకాలను పర్యవేక్షించేందుకు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.. నోడల్ శాఖ భూముల ధరను నిర్ణయించి.. ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా […]
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,30,430 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,798 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ బారినపడి మరో 14 మంది మృతి చెందారు. ఇక, 24 గంటల్లో 2,524 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం 23,561 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,98,611కు చేరింది, రికవరీ […]
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే, మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. మరోవైపు.. వివిధ పోటీ పరీక్షల దరఖాస్తుల గడువులు కూడా పొడిగిస్తూ వస్తున్నారు.. తాజాగా, మరోసారి తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులు గడువు ఇచ్చారు.. లేట్ ఫీజు లేకుండా ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.. కాగా, ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు […]
తెలంగాణలో కొత్త లాక్డౌన్ సడలింపులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. కానీ, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. ఇంకా పాజిటివ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.. అయితే, రెండు జిల్లాలను కలుపుతూ ఉన్న ఒక పంచాయతీలో మాత్రం.. రెండు లాక్డౌన్లు అమలు చేయాల్సిన పరిస్థితి.. […]
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కొత్త వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కేంద్రం… త్వరలో బయోలాజికల్-ఈ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది… ఇప్పటి […]
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ లో కాస్త […]