మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి.. కానీ, డబ్బుల కోసం ఆశపడి తన కోడలినే అమ్మేశాడు… తన కుమారుడి భార్యను రూ.80 వేలకు ఓ ముఠాకు అమ్మేందుకు సిద్ధపడి డీల్ కుదుర్చుకున్నాడు.. అయితే, ఈ విషయం కుమారుడికి తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో, దాని వెనుక ఉన్న ఓ ముఠా గుట్టురట్టుఅయ్యింది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్ లో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన కోడలిని గుజరాత్‌కు […]
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్ అంటేనే నాకు వద్దు బాబోయ్ అనేవారు ఉన్నారు.. కానీ, ఓ మారుమూల గ్రామంలో.. వందకు వందశాతం మంది వ్యాక్సిన్ తీసుకుని రికార్డు కెక్కారు.. ఈ అరుదైన ఘనత సాధించింది జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్ గ్రామం.. అక్కడ 18 ఏళ్లు పైబడిన […]
కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో కేవలం 316 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 41 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 521కు పెరిగింది.. యాక్టివ్ కేసులు […]
గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… జగనన్న స్వచ్ఛసంకల్పం, గ్రామపంచాయతీల పరిధిలో లేఅవుట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలని… ప్రభుత్వపరంగా వాటి క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని.. అనుమతి లేని లేఅవుట్ల రెగ్యులరైజ్ తో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని స్పష్టం చేశారు.. ఇక, జగనన్న స్వచ్ఛసంకల్ప్ ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామాణాలుగా తీర్చిదిద్దాలన్న ఆయన.. పారిశుధ్యం, గ్రామాల్లో […]
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్ మూడో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్ వేవ్‌లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు.. మరోవైపు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్.. […]
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు.. ఈ నేపథ్యంలో… రేపు అన్ని జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.. రేపు ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరగనుండగా… జూలై 8న పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం, […]
తొలిసారి ఎంపీగా విజయం సాధించారు ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా… మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. లోక్‌సభలో అడుగుపెట్టారు.. అయితే, ఆమెకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసులో బాంబే హైకోర్టు షాకిచ్చింది… కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు.. ఆమెకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.. కాగా, తెలుగు సినిమాల్లోనూ నటించిన నవనీత్ కౌర్ అందరికీ సుపరిచితురాలు.. 35 ఏళ్ల ఈ యువ ఎంపీ.. ఏకంగా ఏడు […]
గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాలను తమకు అప్పగించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అదానీ గ్రూప్.. దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయిలో అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. దీంతో.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ గ్రూప్‌కు వెళ్లిపోతుందనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది అవాస్తవం అన్నారు.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి […]
కరోనా సమయంలో ఆర్టీసీ బస్సులు మునుపడిలా తిరిగే పరిస్థితి లేదు.. చాలా బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి.. ఈ సమయంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది ఏపీఎస్ ఆర్టీసీ… దీంట్లో భాగంగా.. పల్లెవెలుగు బస్సులకి కొత్త రూపు ఇస్తున్నారు.. కార్గో ఆదాయంపై ఫోకస్ పెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ.. కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులను కార్గో క్యారియర్లుగా మార్చేస్తోంది… ఇప్పటికే 80 బస్సుల్లో 30 బస్సులను కార్గో క్వారియర్లుగా తయారు చేసింది ఆర్టీసీ.. నెల్లూరుకు 10 బస్సులను […]
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో […]