హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ దగ్గర ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు… మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఇక, వేగంగా దూసుకెళ్తున్న కారు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు.. కారు డ్రైవర్ అప్రమత్తతలో ప్రమాదం తప్పగా.. ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించాడు మరో యువకుడు.. ఆ ఇద్దరు అన్నదమ్ములు గుర్తించారు పోలీసులు.. అదే సమయంలో ప్రగతి భవన్ దగ్గర మంత్రి హరీష్‌రావు క్వానాయ్ రాగా.. క్వానాయ్ పైకి దూసుకెళ్లారు.. […]
పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం కురిసింది.. ఉరుములు, మెరుపులతో పిడుగులే కురుస్తున్నాయా? అనే తరహాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి.. అంతే కాదు.. ఈ పిడుగు పాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది మృతిచెందగా.. మరికొంతమంది గాయాలపాలయ్యారు.. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది.. పిడుగుపాటుకు ముర్షిదాబాద్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. హుగ్లీలో మరో 9 మంది మృతిచెందారు.. ఇక, మిడ్నాపూర్ జిల్లాలో మరో […]
కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. మంగళవారం రోజు జగనన్న తోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు బదిలీని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.. వరసగా రెండో ఏడాది […]
కరోనా కట్టడి కోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్.. అయితే, కేంద్రం వ్యాక్సినేషన్ విధానంపై ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు.. ఓవైపు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు, ప్రతిపక్షాల డిమాండ్లు, ఇంకోవైపు సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. దీంతో కేంద్రం దిగిరాకతప్పలేదు.. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అంటూ.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.. రాష్ట్రాలు ఒక్కరూపాయి కూడా వ్యాక్సిన్లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని.. 75 శాతం రాష్ట్రాలకు సరఫరా చేస్తే.. 25 […]
సమ్మెకు సిద్ధం అవుతున్నారు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు… ఈ మేరకు ఏపీ సర్కార్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు… ఈనెల 9వ తేదీ నుంచి విధులు బహిష్కరించాలని జూనియర్ రెసిడెంట్ వైద్యులు నిర్ణయించారు.. ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని కోరుతున్న వైద్యులు.. జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని కూడా మరో డిమాండ్ ఉంది.. స్టైఫండులో టీడీఎస్ కట్ చేయకూడదని కోరుతున్న వైద్యులు.. ఈ నెల […]
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేరళ.. గతంలో ఇచ్చిన సడలింపులు యథావిథిగా కొనసాగుతాయని ప్రకటించింది.. కేరళలో ఇంకా భారీగానే కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. దీంతో.. ఈ నెల 16వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించినట్టు లెఫ్ట్ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈనెల 12, 13 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేయనున్నారు.. ఈ సమయంలో నిత్యావసరాల షాపులు, పరిశ్రమలకు ముడిపదార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు బ్యాంకులు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామన్నారు.. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార […]
తెలంగాణలో స్కూల్స్ రేషనలైజేషన్ పై విద్యాశాఖలో చర్చ నడుస్తోంది.. అయితే, హేతుబద్దీకరణ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.. రేషనలైజేషన్ చేస్తే రాష్ట్రంలో 3 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటున్నారు.. దీనిపై 2015-16లో హేతుబద్దీకరణ పై ప్రభుత్వం ఆలోచించినా.. మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. అయినా, పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పరిస్థితి మెరుపడలేదు.. రాష్ట్రంలోని 1243 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ దీనికి నిదర్శనం.. ఒక్క విద్యార్థి కూడా లేని వాటిలో […]
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గనేలేదు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. థర్డ్ వేవ్ వస్తే ఎలా..? చిన్నారులు ఎక్కువ మంది కోవిడ్ బారినపడితే ఏం చేద్దాం అనే దానిపై ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు.. ఇక, ఏపీ ప్రభుత్వం చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది.. ఏపీలో 20 ఏళ్ల లోపు 11.07 శాతం మంది ఉన్నారని తెలిపిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. మూడో […]