వైరల్: టీ-20 మ్యాచ్‌లో వికెట్ తీసిన దెయ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దెయ్యాల గురించి రకరకాలుగా కథలు చెబుతుంటారు.. కొందరు నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది అంటే.. మరికొందరు.. అక్కడ దెయ్యం ఇలా చేసిందటా? అని చెబుతుంటారు.. దెయ్యం కథలతో వచ్చే సినిమాలకు కూడా మంచి ఆదరణ లేకపోలేదు.. ఇక, అసలు విషయానికి వస్తే.. దెయ్యం క్రికెట్ గ్రైండ్‌లోకి దిగిందా..? బంతి పడకముందే.. దెయ్యమే వికెట్లు తీస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. చరిత్రలో దెయ్యం తీసిన తొలి వికెట్ ఇదేనంటూ ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు.. ఈ విచిత్రమైన ఘటన జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో జరిగింది. ఆ వీడియో కాస్త నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.
బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో బ్యాట్స్ మెన్ విచిత్రమైన రీతిలో ఔట్ అయ్యాడు.. ఎవరి ప్రమేయం లేకుండగానే వికెట్ల మీద ఉండే బెయిల్స్ వాటంతట అవే పడిపోయాయి.. ఇటీవల జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సాగుతుండగా.. 18వ ఓవర్ నడుస్తోన్న సమయంలో ఆ జట్టుకు చెందిన మహమ్మద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.. అయితే, బాల్ ఇంకా బ్యాట్స్‌మన్ దగ్గరకు కూడా రాలేదు.. కానీ, అతని వెనుక ఉన్న వికెట్ల మీది బెయిల్స్ వాటంతట అవే కింద పడిపోయాయి. బ్యాట్స్‌మన్ కానీ.. బాల్ కానీ తగిలింది లేదు.. అయినా బెయిల్స్ జారిపోయాయి.. మొదట బ్యాట్స్ మెన్ వికెట్లను తాకాడేమోనని అంతా భావించారు.. కానీ, అలాంటిదేమీ లేదు.. కానీ, బెయిల్స్ పడిపోయాయి. ఆ దృశ్యాలు కెమెరాలోనూ స్పష్టంగా రికార్డు అయ్యాయి.. అవి ఎందుకు పడిపోయాయో ఎవరికీ అర్థం కాకపోయినా.. గాలి వల్ల బెయిల్స్ పడిపోయి ఉంటాయని కొందరు చెబుతున్నారు.. కానీ, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దెయ్యం తీసిన వికెట్ అని కొందరు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి దెయ్యం వికెట్ తీసిందని మరికొందరు.. క్రికెట్‌లో దెయ్యాలు చొర్రబడ్డాయని ఇంకొందరు ఇలా… రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ జోడిస్తున్నారు.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
First ever wicket taken by a ghost 😛😂 pic.twitter.com/9vG0BI50S4
— Mazher Arshad (@MazherArshad) July 24, 2021
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!