22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న రష్యాకు చెందిన విమానం ఇవాళ సముదంలో కుప్పకూలింది.. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా గల్లంతయ్యారు.. పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు మొత్తం 28 మందితో బయల్దేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్‌పోర్ట్‌కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో.. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు. […]
పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి అవి తిరిగి గాడిన పడే ప్రయత్నం చేయాలన్నారు.. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం […]
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్.. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో పర్యటించిన ఆయన.. నిన్న కత్తుల దాడిలో గాయపడిన కుటుంబాలను పరామర్శించారు. వైసీపీ వర్గీయులు దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఎస్సైకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. ఇక, ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్.. గడచిన ఐదేళ్లలో ఆముదాలవలస నియోజకవర్గంలోని […]
ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపడం, కొత్త చట్టాలను ఆమోదించడం లాంటి కీలకమైన పనులు చేయాల్సిన చట్టసభల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రశ్నలు.. తిట్లు.. ఇలా ఎన్నో చూస్తుంటాం… ప్రజాప్రతినిధులు వాడే భాష కొన్నిసార్లు వినడానికే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి.. ఇక, నిరసనలు, ఆందోళనలు సరేసరి.. కొన్నిసార్లు అవి శృతిమించి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. పేపర్లు విసురుకోవడం.. మైకులు విసరడం.. ఇలా ఎన్నో ఘటనలు చూశాం.. కానీ, పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల ‘అనుచిత ప్రవర్తన’పై […]
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి.. ఇప్పటికే పలు దపాలుగా ఆయల పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతుండగా.. మళ్లీ ఎగిరాయి డ్రోన్లు.. ఇక, డ్రోన్లను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.. అయితే, శ్రీశైలంలో గత నాలుగు రోజులుగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్లు సంచరిస్తున్నాయి.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది […]
కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో విద్యా సంవత్సరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చాయి… అయితే, 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మార్పులు చేసింది.. రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది సీబీఎస్ఈ.. 50 శాతం సిలబస్ చొప్పున రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో […]
పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్… సోనియా గాంధీ కలవనున్నారని సమాచారం. రేపు సాయంత్రం సోనియా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పార్టీలో లేదా ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి… కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమరీందర్‌సింగ్‌లో సోనియా సమావేశం ఆసక్తి రేపుతోంది. ఇక సిద్దూ ఇప్పటికే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ కలిశారు. సీఎం అమరీందర్‌సింగ్, […]
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు. […]
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన పరిణామలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. తనకు టీఎంసీలో ఏ పదవి ఇచ్చినా… సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. బెంగాల్లో బీజేపీ […]
దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పై విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో విజయవాడ దుర్గగుడిలో ఈవోగా పని చేసిన కాలంలో ఆజాద్ పై ఆరోపణలు రాగా… ఇప్పుడు విచారణను ఆదేశించింది సర్కార్.. విచారణాధికారిగా దేవదాయ శాఖ కమిషనర్ అర్జున రావును నియమించారు.. అయితే, ఆజాద్ పై అవకతవకలు ఆరోపణలపై గతంలో విచారణాధికారిగా ఉన్న పద్మ రిటైర్ కావడంతో ఆమె స్థానంలో అర్జునరావును నియమించింది ప్రభుత్వం… చంద్రశేఖర్ ఆజాద్‌పై విచారణను నెల రోజుల్లో […]