మానుకోట ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. కవితపై గతంలో నమోదైన కేసును కొట్టివేసింది కోర్టు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారంటూ 2019లో కవితపై కేసు నమోదైంది.. ఈ కేసులో విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానాను గతంలో విధించింది.. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు కవిత.. అయితే, ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు.. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై స్టే విధించింది.. ఇవాళ మరోసారి ఎంపీ కవితపై పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆమెపై ఉన్న కేసును కూడా కొట్టివేసింది. దీంతో.. మానుకోట ఎంపీ కవితకు భారీ ఊరట లభించింది.