కరోనా మహమ్మారి కారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు పొడిగిస్తూనే వస్తోంది ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.. గతంలో సీబీడీటీ ప్రకటించిన తేదీ ప్రకారం డెడ్‌లైన్ సెప్టెంబర్ 30 వరకు ఉండగా.. ఇవాళ ఆ తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సాధారణ జూలై 31, 2021 వరకే ఉంది.. అయితే, కొత్త ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ లోపాలు మరియు ఇతర సమస్యలు ఇబ్బందిగా మారాయి..
కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ఏర్పాటు చేసిన సంస్థకు అన్ని సమస్యలను పరిష్కరించడానికి సెప్టెంబర్ 15, 2021 వరకు సమయం ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ఇప్పటికీ అన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం కూడా, ప్రభుత్వం ITR దాఖలు చేసే గడువును నాలుగు సార్లు పొడిగించింది.. మొదట జూలై 31 నుండి నవంబర్ 30, 2020 వరకు, తరువాత డిసెంబర్ 31, 2020 వరకు, చివరకు జనవరి 10, 2021 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2021-22 ఐటీ రిటర్న్స్ లపై ఫిర్యాదులు అందాయి.. ఆడిట్ నివేదికలను దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు నివేదించిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్ని సీబీడీటీ… ఆడిట్ నివేదికల దాఖలు గడువు తేదీని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.