పోలీసుశాఖలో రిక్రూట్మెంట్ పై అపోహలు, అనుమానాలు వద్దని తెలిపారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్… మహిళా సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే దిశగా ముందుకు కదులుతోందన్నారు.. ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు శాఖ ప్రతినిధి ఉండాలనే […]
మానవత్వం చాటుకున్నారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. కామారెడ్డి జిల్లా పర్యటన ముగించుకుని నిజామాబాద్ జిల్లాలోని మంత్రి స్వగ్రామమైన వేల్పూర్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఆర్మూర్ క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాన్ని గమనించారు.. వెంటనే తన కాన్వాయ్ ఆపి.. క్షతగాత్రుల దగ్గరికి వెళ్లి పరామర్శించిన మంత్రి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గాయపడినవారిలో చిన్న పాప ఉండడం చూసి చలించిపోయారు. వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తన కాన్వాయ్‌లోని […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య ఎనిమిది వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,03,398 సాంపిల్స్ పరీక్షించగా.. 808 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 1,061 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కు చేరగా.. రికవరీ కేసులు 6,12,096గా […]
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శకం ప్రారంభం కానుంది.. మరో మూడు రోజుల్లో పార్టీని ప్రకటించనున్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల… ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయమని స్పష్టం చేసిన ఆమె.. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.. షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రర్ చేయించారు.. ఇక, తాజాగా పార్టీ జెండా కూడా రెడీ అయిపోయింది.. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట […]
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,731 సాంపిల్స్ పరీక్షించగా.. 2,100 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 21 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. తాజా మృతుల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చి మ గోదావరిలో ఒక్కొక్కరు ఉన్నారు.. […]
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న […]
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా […]
కరోనా మహమ్మారి కలవర పెడుతూనే ఉంది.. ఎప్పుడు, ఎవరికి, ఎక్కడి నుంచి కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.. కాగా, ఉద్యోగులకు […]
తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్ దోపిడీని బయటపెడతామని.. అయన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందేనని వ్యాఖ్యానించారు.. ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన ఆయన.. శిశుపాలుడి పాపాల కంటే కేసీఆర్ పాపాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారు.. తప్పుడు సమాచారం ఇచ్చే సన్నాసిని మాత్రం నేను కానని.. మీరే కాదు.. మీ ఇంజనీర్లు కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చూపించాలని […]