కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.. రేపు సాయంత్రం 5.30 – 6 గంటల మధ్య కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది.. కనీసం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. మొత్తంగా 20 మందికి పైగా కొత్తవారికి బెర్త్‌లు దక్కే అవకాశం ఉందని సమాచారం.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కొచ్చని చెబుతున్నారు.. కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు.. పాత మంత్రులకు షాక్ […]
జేఈఈ మెయిన్స్ 3వ, 4వ విడత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.. కోవిడ్ కారణంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన మూడు, నాల్గోవ విడత జేఈఈ మెయిన్స్ వాయిదా పడగా.. ఫిబ్రవరి, మార్చిలో మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్స్ నిర్వహించారు.. ఇవాళ మిగతా సెషన్స్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. ఏప్రిల్ నెలలో జరుగాల్సిన సెషన్‌ను ఈనెల 20 నుంచి 25 రెండో సెషన్ జసరుగుతుందని తెలిపారు. అలాగే మే నెలలో జరగాల్సిన […]
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని […]
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సబ్సిడీపై ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనుంది వైఎస్ జగన్ సర్కార్.. ఉద్యోగులకు అవసరమైతే సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.. మిగతా మొత్తాన్ని వాయిదా పద్దతిలో చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్ సంస్థలు రాయితీ ఇస్తాయని స్పష్టం చేసింది సర్కార్… ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు […]
కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా… తాజా పరిణామాలు చూస్తుంటే.. కేబినెట్ పునర్వ్యవస్తీకరణకు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… ఎల్లుండే భారీ విస్తరణ జరగనున్నట్టు సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్లో 20 మందికి పైగా కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులతో […]
కరోనా సమయంలోనూ వరుసగా లక్ష కోట్లను దాటుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ సారి పడిపోయాయి.. 8 నెలల తర్వాత జూన్‌లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయల దిగువకు చేరాయి.. తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ గత నెలలో రూ. 92,849 కోట్లు వసూలైంది.. ఇందులో సీజీఎస్టీ రూ. 16,424 కోట్లు కాగా.. ఎస్జీఎస్టీ రూ. 20,397 కోట్లుగా ఉంది.. ఇక, ఐజీఎస్టీ రూ. 49,079 కోట్లు, వస్తువుల దిగుమతులపై రూ. 25,762 కోట్లు.. వస్తువుల […]
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన […]
క్షేత్ర స్థాయి పర్యటనల పై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని ప్రతి వారం సందర్శించాలని సూచించారు.. జాయింట్ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్న ఆయన.. మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించాలని సూచించారు.. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టగానే నేను వారానికి రెండు సార్లు గ్రామ, […]
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ […]
ఇవ్వాల్సిన సమయానికి సెకండ్ డోస్ వేయకపోతే వ్యాక్సిన్ వృథా అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారం అన్నారు.. వ్యాక్సినేషన్లో ఇంకా చాలాదూరం మనం వెళ్లాల్సి ఉందన్న ఆయన.. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అసలు ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌డోస్ ఇవ్వకపోతే వ్యాక్సిన్ వృథా అవుతుందని సూచించారు.. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని […]