17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి ఎన్నంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
17 రాష్ట్రలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.. “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” (పీడీఆర్డీ) గ్రాంట్ కింద ఆరో విడత నిధులు విడుదల చేసింది.. దేశంలోని 17 రాష్ట్రాలకు 6వ విడత కింద రూ. 9,871 కోట్లు విడుదలయ్యాయి.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అర్హత కలిగిన రాష్ట్రాలకు “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” గ్రాంట్ కింద రూ. 59,226 కోట్లు విడుదలైనట్టు అయ్యింది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పీడీఆర్డీ రెవెన్యూ లోటు గ్రాంట్‌ను కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలకు రెవిన్యూ లోటు నిధులను సిఫార్సు చేసింది ఆర్థిక సంఘం..
ఇక, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1438 కోట్లు రెవెన్యూ లోటు నిధులు విడుదలయ్యాయి.. ఏపీకి రెవెన్యూ లోటుకు సంబంధించి ఆరో విడత కింద రూ.1,438.08 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీంతో ఇప్పటి వరకు రెవెన్యూ లోటుకు సంబంధించి ఏపీకి మొత్తం రూ.8,628.50 కోట్లు విడుదలయ్యాయి… కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ.1,18,452 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో రూ. 59,226 కోట్లు అంటే ఇప్పటి వరకు 50 శాతం నిధులు విడుదల చేసింది.. ఆర్థికసంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!