గణేష్ ఉత్సవాలు.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక ఉత్సవాలు, నిమజ్జనానికి హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ, నిమజ్జనం పై ఆంక్షలు విధించింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావ్.. హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా తమకు అందలేదన్న ఆయన.. ఈ సారి సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.. ఈ నెల 19న సామూహిక నిమజ్జనం ఉంటుందని.. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరగుతుందన్నారు.. ఇది ప్రజల కార్యక్రమం, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంది… అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక, గణేష్ మండపాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.. మరోవైపు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారీకి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది.. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు భగవంత రావ్.
కాగా, గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనంపై ఆంక్షలు విధించింది తెలంగాణ హైకోర్టు.. తమ ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని… హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని స్పష్టం చేసింది.. ఇక, హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని పేర్కొంది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని పేర్కొంది హైకోర్టు. దీంతో.. నిమజ్జన కార్యక్రమం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..