కృష్ణా జలాల వివాదంలో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతులు ఎంట్రీ ఇచ్చారు.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా రైతులు.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.. జూన్ 28 తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 34ని సవాల్ చేవారు రైతులు.. జీవో 34 విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.. […]
తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్ వరకు నడవనున్నట్టు […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్ వార్ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను […]
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కొత్త పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం.. దానికి కౌంటర్‌గా ఆ ఎమ్మెల్యేలు ఎదురు దాడిగి దిగడం జరిగిపోయాయి.. మీరు రాళ్లు విసిరితే.. మేం చెప్పులతో కొడతామంటూ హాట్ కామెంట్లు చేశారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. అయితే, ఆ వ్యాఖ్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేరన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.. ఎర్రబెల్లి, […]
వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలింది.. ప్రమాదం జరిగిన సమయంలో 92 మంది సిబ్బంది విమానంలో ఉన్నారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది రక్షించామని.. 17 మంది జవాన్లు మృతిచెందినట్టు గర్తించామని చెబుతున్నారు డిఫెన్స్ సెక్రటరీ.. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది జవాన్లు, సిబ్బందితో వెళ్లిన విమానం.. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది.. ఆ తర్వాత మంటలు చెలరేగాయి.. […]
హైదరాబాద్ నడిబొడ్డున… అదీ జూబ్లీహిల్స్.. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో దర్జాగా భూ దందా..! ఒకటి కాదు రెండు కాదు… అక్షరాలా 15 వందల కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది.. గిమ్మిక్కులతో జిమ్మిక్కులు చేసి… లొసుగుల్ని అనుకూలంగా మలుచుకుని ఫిల్మ్‌నగర్‌లోని పదెకరాలు కారుచౌకగా కొట్టేయడమే కాకుండా… మరో నాలుగున్నర ఎకరాలకు ఎసరుపెట్టింది ఎవరు? రెడ్‌ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్నదెవరు అంటే ఇద్దరు బడా నేతలన్నది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి ఈ ప్రైమ్ ల్యాండ్‌లో చక్రం తిప్పారు. […]
కరోనా దెబ్బతో ఏదైనా పనిచేసుకుందామన్న దొరకని పరిస్థితి.. వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరాని దుస్థితి.. ఖాళీగా ఉండలేక వ్యవసాయం చేద్దామంటే ఎద్దులు లేకపోవడం ఓవైపు అయితే.. మరోవైపు ట్రాక్టర్‌ను పెట్టి దున్నించడానికి డబ్బు కూడా లేదు.. ఈ సమయంలో.. ఆ రైతు మెదడుకు వినూత్నమైన ఆలోచన తట్టింది.. తన పాత సైకిల్‌తోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.. ఔరా..! అనిపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా దెబ్బకు […]
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కొన్ని దేశాలను ఇప్పటికే టచ్ చేయగా.. రోజుకో వేరియంట్ తరహాలో కోవిడ్ కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే.. తాజా పరిస్థితులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.. కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని హెచ్చరించారు.. కరోనా డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. […]
కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత శైలేంద్ర పై హైదరాబాద్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.. కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో గుట్కా తయారీదారులకు మద్దతిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు.. షాహినాజ్గంజ్ పీఎస్ లో శైలేంద్ర తో పాటు బీజేపీ చెందిన మరో ముఖ్య నాయకుల పై కేసు నమోదైంది.. కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకి అత్యంత సన్నిహితుడిగా శైలేంద్ర.. కర్ణాటక ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు. బీదర్ నుంచి వస్తున్న […]
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ఇప్పటికే 35.12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పూర్తి చేసింది ప్రభుత్వం.. ఇదే సమయంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన రకరాల ప్రయోగాలు సాగుతున్నాయి.. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్లు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ తరుణంలో.. కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇచ్చినా.. డెల్టా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు తేల్చింది భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)… కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు […]