భారీ వర్షాలు, వరదలు పలు రైళ్లు రద్దు చేయడానికి.. కొన్ని రీషెడ్యూల్ చేయడానికి దారితీశాయి.. సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వర్షం నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు, దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్-హౌరా రైలును రద్దు చేశారు. ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్-త్రివేండ్రం, ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు… న్యూ కూచ్ బెహర్, మాతాభాంగ్, […]
తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి […]
తెలంగాణలో ప్రస్తుతం దళితబంధుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అర్హులైన పేద దళిత కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దీని విధివిధానాలపై ఆయా వర్గాలతో చర్చలు జరిపారు. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు… ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత […]
నేటి నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాకు ఛార్జీలు పెరిగాయి.. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు 15 నుంచి 17 రూపాయలకు, ఆర్థికేతర లావాదేవీలపై 56 రూపాయలకు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్‌ఛేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ […]
కరోనా కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్డౌన్, కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ అమలు చేశాయి.. ఇంకా కోవిడ్ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో… ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.. చాలా వరకు సడలింపులు ఇచ్చినా.. మరోవైపు.. పరిస్థితులను బట్టి.. కర్ఫ్యూ, నైట్ కర్ప్యూ పొడిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం […]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా, […]
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా […]
మేషం : ఈరోజు మీరు అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. జాగ్రత్త వహించడం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలకు అనుకూలం. మీ శ్రీమతి మొండి వైఖరి […]
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇప్పటికే టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌కు సైతం కరోనా సెగ తగిలింది.. పలువురు క్రీడాకారులు కరోనబారినపడ్డారు.. అయితే, కరోనా కల్లోలం సృష్టించడంతో జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.. క్యాపిటల్ సిటీ టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్.. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రకటించినట్టు ప్రధాని సుగ కార్యాలయం వెల్లడించింది.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని.. […]
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి… అయితే, కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుంటూ.. క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి స్కూళ్లను తెరిచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.. అందులో భాగంగా.. ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది పంజాబ్ ప్రభుత్వం.. ఆగస్టు 2వ తేదీ నుంచి పాఠశాలల తెరవాలంటూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ సర్కార్.. […]