తెలుగు అకాడమీ స్కామ్.. అసలు కారణం ఇదే-త్రిసభ్య కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. దీంతో, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం.. అసలు ఈ నిధుల గోమాల్‌కు ప్రధాన కారణం ఏంటి? అనేతి తేల్చింది త్రిసభ్య కమిటీ.. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్ మాల్ కు ప్రధాన కారణం అని తన నివేదికలో పేర్కొంది త్రి సభ్య కమిటీ.. తెలుగు అకాడమీకి సంబంధించిన నిధులు అన్ని బ్యాంకులలో కలిపి రూ.340 కోట్లు ఉండగా.. మూడు బ్యాంక్ అకౌంట్స్ నుండి నిధులు గోల్‌మాల్ అయ్యాయి.. యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లోని అకౌంట్ నుండి రూ.43 కోట్లు, సంతోష్ నగర్ నుండి రూ.12 కోట్లు, చందానగర్ లోని బ్రాంచ్ అకౌంట్ నుండి రూ.10 కోట్లు మాయం చేసినట్టు తేల్చింది.
అకౌంట్స్ ఆఫీసర్ నుండి డైరెక్టర్ వరకు నిధుల గోల్ మాల్ పై ఇన్వాల్విమెంట్ లేకున్నా… ఏమి జరుగుతుందో పట్టించుకోలేదు.. కావున వారందరు బాధ్యులే అని నివేదికలో పేర్కొంది త్రిసభ్య కమిటీ.. బాధ్యులపై క్రిమినల్ చర్యలే కాకుండా, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సూచిచింది.. అకౌంట్స్ విషయంలో రెగ్యులర్ ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేసింది.. తెలుగు అకాడమీకి ఇంచార్జ్ లను కాకుండా రెగ్యులర్ డైరెక్టర్ ని నియమించాలని.. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిధులపై రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలని ప్రభుత్వానికి నివేదించింది త్రిసభ్య కమిటీ. మొత్తంగా తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో 22 పేజీల రిపోర్ట్ తయారు చేసి.. విచారణ వివరాలతో పాటు… సిపార్సులు కూడా చేసింది ఉమర్ జలీల్ కమిటీ.
Also Read
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!