దళిత బంధుతో దళితులను దగా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి.. కేసీఆర్ దళితుల గురించి ఎన్నో చెప్పారు.. దళితులని సీఎం చేస్తా అన్నారు.. లేదంటే తల నరుక్కుంటా అన్నారన్న ఆమె.. డిప్యూటీ సీఎం రాజ్యను ఎందుకు కేబినెట్ నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. సబ్ ప్లాన్ ఫండ్స్ కోసం ఏడేళ్లుగా రూ.85,913 కోట్లు కేటాయించారు.. కానీ, ఏడేళ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.47,685 కోట్లు మాత్రమే.. మిగతా […]
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.. వారి బలిదానాలను వృతా కానివ్వం అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వేలాది మంది నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.. ఆ మహనీయుల బలిదానాలు వృథా కానివ్వం.. వారి స్ఫూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారాయన.. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా […]
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా జేసీ బ్రదర్స్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని కేసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండివచ్చారు.. రిలీజైన వెంటనే మళ్లీ కేసులు వెంటాడాయి. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ […]
కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైపోయిందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది.. మళ్లీ కరోనా కల్లోలం సృష్టించబోతోంది అని హెచ్చరించింది.. గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది కొత్తగా కరోనా మహమ్మారి బారినపడ్డారని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియేసస్.. మరో రెండు వారాల్లోగా ఆ సంఖ్య 20 కోట్లకు చేరుతోందని తెలిపారు.. అంటే రానున్న రెండో వారాల్లో ప్రపంచవ్యాప్తంగా […]
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలేది లేదు అనే తరహాలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరినీ టచ్ చేస్తూనే ఉంది… ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సోకిన వైరస్.. కొంత మంది ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనాబారనపడ్డారు.. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారి లక్షణాలతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యే […]
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయిపోయింది… బంగారు పతకానికి మరో అడుగు దూరానికి చేరుకున్నారు కమల్‌ప్రీత్ కౌర్… ఒలింపిక్స్ మహిళల డిస్కస్‌త్రో ఈవెంట్లో తుదిపోరు కోసం నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్.. రెండోస్థానంలో నిలిచారు కమల్‌ప్రీత్ కౌర్.. తన అద్భుతమైన ప్రదర్శనతో 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించి ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లారు.. ఇక, డిస్కస్‌త్రో ఫైనల్ ఆగస్టు 2వ తేదీన జరగనుంది.. ఈ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్ ఫైనల్లోనూ మంచి […]
టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగు తేజం పీవీ సింధు… శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ అకానా యమగూచిపై విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించారు.. తద్వారా ఓ అరుదైన రికార్డును కూడా సాధించగారు.. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించారు.. అయితే, ఇవాళ జరగనున్న సెమీస్ సింధుకు కఠిన సవాల్ గా చెప్పాలి.. ఎందుకుంటే వరల్డ్ నెంబర్ […]
తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు […]
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు అధికారులు.. అయితే, ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చిన తక్కళ్లపల్లి గ్రామస్తులు, మహిళలు… ఆ టవర్లను కూల్చివేశారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. కాగా.. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు.. తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి అమెజాన్ […]
కోమటిరెడ్డి బద్రర్స్‌పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన.. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦.. కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుంది.. కానీ, పనులు చేయడంలో ఉండదన్న […]