కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. అయితే, వ్యాక్సిన్ పంపిణీలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. వంద శాతం లక్ష్యాన్ని చేరుకుని రికార్డుకెక్కింది.. సిటీలోని 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ రెండు డోసులు పంపిణీ చేసింది.. అదనంగా దాదాపు లక్ష మంది వలస కార్మికులకు మొదటి డోసు వ్యాక్సిన్ కూడా అందించారు.. ఈ విషయాన్ని భువనేశ్వర్ మున్సిపల్ […]
కరోనా మహమ్మారి సమయంలో పూర్తిగా కోవిడ్ రోగుల సేవలకే పరిమితం అయ్యింది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి… మొదటి వేవ్ తగ్గిన తర్వాత నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్ వేవ్ పంజా విసరడంతో.. కోవిడ్ సేవలకే పరిమితం అయ్యింది… అయితే, క్రమంగా ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. కోవిడ్ […]
భారత్‌లో మరింత వేగంగా వ్యాక్సినేషన్ వేసేందుకు.. దేశంలోని వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వాడుతూనే.. విదేశీ సంస్థలకు చెందిన వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది భారత్ ప్రభుత్వం.. అయితే, కొన్ని సంస్థలు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది… భారత్‌లో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును జాన్సన్ అండ్ జాన్సన్ […]
టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా […]
పదో తరగతి పరీక్షలు ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాలను వెల్లడికి అనువైన విధానంపై నివేదిక ఇచ్చింది హైపవర్ కమిటీ. 2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపొందించిన ఫార్ములాను ప్రభుత్వం ఆమోదించింది.. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ […]
పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన.. పరిరక్షణ కమిటీ పోరాటంలో పాలు పంచుకుంటామని తెలిపారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని గుర్తుచేసిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మభిమానం అని పార్లమెంట్ లో స్పష్టం చేశామన్నారు.. ఇక, స్టీల్ ప్లాంట్‌కు గనులను కేంద్ర […]
హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు జరుగుతున్నాయి.. ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి… వైపీసీ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ… ఇక, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వమించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశానని గుర్తుచేసుకున్నారు.. నేను వైసీపీ ఎమ్మెల్యేను, […]
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె […]