సీమ బిడ్డలు అంతా ఏకతాటిపైకి వచ్చి జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలిసిన ఆయన.. భవిష్యత్ తరాల కోసం అంతా కలిసి పోరాడాలని ఆయనను కోరారు.. ఇప్పటికే పలువురు అధికారులతో పాటు సీనియర్ నేతలను కూడా కలిసినట్టు చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉంటారు.. కానీ, పోరాటాలకు కాదన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇక, తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం […]
విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారన్న ఆమె.. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని… మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని.. ఆళ్లగడ్డ […]
తనకు నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గతంలో తనకు అవకాశాలు వచ్చినా.. పార్టీ సేవకు అంకితం అయ్యాయని గుర్తుచేసుకున్నారు.. నాకు రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చినా వదులుకున్నానని.. పార్టీ సేవకే అంకితం అయ్యా.. అజీజ్ పాషాకు అవకాశం ఇచ్చామని తెలిపారు.. ఇక, తాను ఎక్కడ పోటీచేసినా పార్టీ అవసరాల కోసమే చేశానని.. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు నారాయణ.. తాను 50 […]
రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్… శ్రీకాకుళం ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. 175 ఆలయాల్లో (ఈఎంఎస్) టెంపుల్ మేనేజ్ మెంట్ విధానంలో పరోక్ష సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.. ఈఎంఎస్ ద్వారా ఇంట్లో ఉండి కూడా భక్తులు ఆన్లైన్లో పూజలు చేసుకోవచ్చన్న ఆమె.. ఈ హుండీ ద్వారా ఆన్ లైన్ లో దాతలు విరాళాలు కూడా ఇవ్వొచ్చు అన్నారు.. ఇక, ప్రతీ ఆలయంలో స్థలపురాణం, సేవలను […]
కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. అప్పుడే.. థర్డ్ వేవ్ ప్రారంభమైపోయిదంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, కోవిడ్ మూడో ఉద్ధృతి సూచనలు కనిపిస్తుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కోవిడ్ చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. భారత కొవిడ్-19 క్విక్ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ రెండో దశలో భాగంగా… 15 శాతం నిధులు అంటే 18 వందల 27 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల […]
రాజకీయ రచ్చకు కారణం అవుతోన్న పెగాసస్ అంశంపై విచారణకు సిద్ధమైంది సుప్రీంకోర్టు.. పెగాసస్ పిటీషన్లపై వచ్చే గురువారం విచారణ చేయనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ప్రత్యేక దర్యాప్తును కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా.. న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరొక పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, సీపీఎం ఎంపీ జాన్ […]
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య […]
ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో పతకం ఖాయం అనే రీతిలో ఆశలు రేపిన భారత బాక్సర్ సతీష్ కుమార్ నిరాశపర్చాడు.. పతకానికి మరో అడుగు దూరంలోనే తన పోరాటాన్ని ముగించాడు.. 91 కిలోల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఇవాళ జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ తో తలపడిన సతీష్‌కుమార్.. 0-5తో ఓటమిపాలయ్యారు.. తొలి రౌండ్ నుంచే సతీష్‌పై పూర్తిగా పైచేయి సాధించారు జలలోవ్… ప్రతి రౌండ్లోనూ జడ్జీలు జలలోవ్ […]
సంచలనంగా మారిన ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అ్పపగించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు జార్ఖండ్ సీఎం. ఈ కేసును సుమోటోగా విచారించనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. తనను యాక్సిడెంట్లో చంపేయాలని దుండగులు కుట్ర పన్నారని, త్రుటిలో తప్పించుకోగలిగానని ఫతేపూర్ జిల్లా అడిషనల్ జడ్జి అహ్మద్‌ఖాన్… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో […]
ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క ఒలింపిక్ విలేజ్‌లో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకూ 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే.. […]