గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుండి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. దీంతో.. ఈ పరిణామన్నా సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఘటన అసోంలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు.. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం.. వెంటనే షోకాజ్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,992 శాంపిల్స్ పరీక్షించగా… 2,058 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,053 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్లో ఇద్దరు చొప్పున, […]
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు… అయితే, కేసులపై సీరియస్‌గా స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏవరిని రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారో తెలియదని కామెంట్ చేసిన ఆయన.. కేసు పెట్టిన విషయం కూడా […]
కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు కూడా ఆన్లైన్ విచారణకే పరిమితం అయ్యాయి… కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష విచారణకు సిద్ధం అవుతోంది తెలంగాణ హైకోర్టు.. ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ జరగనుండగా.. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతుందని.. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష […]
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు అధికంగానే ఉన్నాయని తెలిపారు.. డెల్టా వేరియంట్ భారత్ సహా 135 దేశాల్లో తీవ్రంగా ఉందన్న ఆయన.. నిన్న దేశంలోని 50 శాతం కేసులు ఒక కేరళలోనే వెలుగుచూశాయన్నారు.. డెల్టా వైరస్ శరీరం పై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించిన సీఎం.. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు సీఎం.. ఇక, […]
కరుగుడట్టిన ఉగ్రవాదిని జమ్మూ కశ్మీరులో ఖతం చేశాయి భద్రతాబలగాలు.. అత్యంత భయానక ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును… ఇవాళ మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ… పుల్వామాలోని నాగ్‌బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహ్మద్ (జెఎమ్) తో అనుబంధంగా ఉన్న అగ్రశ్రేణి పాకిస్థాన్ తీవ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపోరా పట్టణ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో ఇంకా గుర్తించబడని మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఘటనా స్థలం నుంచి […]
మరోసారి తమిళనాడులోని శివకాశిలో పేలుడు సంభవించింది.. శివకాశికి సమీపంలోని జమీన్‌సల్వార్‌పట్టి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి.. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.. ఇక, భవనం శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బాధితులను వెలికితీసిందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు.. కాగా, తమిళనాడులోని విరుదునగర్ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… మొదట ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లు తయారు చేశారు.. ప్రభుత్వ అనుమతితో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.. క్రమంగా విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇచ్చింది భారత్.. అయితే, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదానిపై పరిశోధనలకు ఆమోదం లభించింది.. […]
రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.. ఇదే రోజు హైదరాబాద్ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు సీపీ అంజనీకుమార్.. బోనాలు, అంబారీ ఊరేగింపు సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించిన ఆయన.. కమిషనర్ నుంచి హోంగార్డు వరకూ అందరూ బందోబస్తు విధుల్లో పాల్గొంటారని.. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి బోనాల ఊరేగింపు లాల్ […]