కేంద్ర సర్కార్‌పై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏదైనా జరగొచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా అడగాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఉద్దేశించిన మాట్లాడిన సీఎం.. దళితుల్లోనే కాదు.. మైనారిటీ, బీసీ, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు.. వాళ్లను కూడా కవర్ చేయాలని.. అన్ని వర్గాలను సమ దృష్టితో చూసే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అన్నారు.
ఇక, ప్రతిదీ ఓటు రూపంలో చూడబోం అన్నారు సీఎం కేసీఆర్… మనిషి కనపడితే ఓటే నా..? అని ప్రశ్నించిన ఆయన.. సామాజిక స్పృహ ఉండాలి కదా? అని మండిపడ్డారు.. దళిత బంధు రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందనే నమ్మకాన్ని వెలిబిచ్చిన సీఎం.. రాజకీయాలకు అతీతంగా అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు నిధులు అందిస్తాం అన్నారు. ఎన్నికల్లో అతను ఎవరికైనా ఓటేసుకొని.. కానీ, ప్రభుత్వ పథకాన్ని అందరికీ వర్తింపజేసేలా ప్రయత్నాలు సాగిస్తాం అన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. రేపు అసెంబ్లీకి సెలవు కావడంతో… సభ ఎల్లుండికి వాయిదా పడింది.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!