ఈటలపై హరీష్‌రావు ఫైర్.. కేసీఆర్‌కు గోరి కడతావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం ధర్మమే అవుతుందన్నారు.. గ్రామాలలో నన్ను చూసే ఇవన్నీ పనులు అవుతున్నాయని చెబుతున్నావు.. ఆనాడు రైతు బంధు ఎవరిని చూసి వచ్చింది, కల్యాణ లక్ష్మి ఎవరిని చూసి వచ్చింది చెప్పు రాజేంద్ర అంటూ ప్రశ్నించారు. నువ్వు పని చేయకనే హుజురాబాద్ వెనుకబడ్డది కనుకనే మిగిలిపోయేనవి పనులను మేం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే నీవ్వు కేసీఆర్ కు గోరి కడతావా…? అంటూ ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌రావు.. తమ్ముడు, కుడిభుజం అన్న.. కేసీఆర్ ను తిడుతున్నాడు… ఫిర్యాదు చేసి బతుకమ్మ చీరెలు రాకుండా చేశారని మండిపడ్డారు. ఇక, వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికి రైతులకు మిత్తితో సహా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ రైతుబంధు కార్డు రైతు భీమా కార్డు ఇస్తే.. బీజేపీ వాళ్లు రైతులపై కార్లు ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నిన్నటి వరకు బీజేపీని తిట్టిన నువ్వు బీజేపీ వద్దంటివి కేసీఆర్ ముద్దంటివి.. ఇప్పుడు బీజేపీలో చేరి బీజేపీ ముద్దు అంటున్నావ్.. కేసీఆర్ కు గోరి కడుతా అంటున్నావు.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నావు.. ఎవరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది అంటూ నిలదీశారు హరీష్‌రావు.
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!