ఆంధ్రుల ఆత్మవిశ్వాసమైన అమరావతిని చిన్నాభిన్నం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. చరిత్రను తొలగించాలనే కుళ్లు కుట్రతోనే పాఠ్యాంశాన్ని కూడా తొలగించారని ఆరోపించిన ఆయన.. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టును కుట్రతో నాశనం చేస్తున్నారని విమర్శించారు.. ఇక, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో వైసీపీ ఉందంటూ ఎద్దేవా చేశారు అనగాని.. ఇప్పటి నుంచి కష్టపడితే అమరావతిని 4 నెలల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లొచ్చని సూచించిన ఆయన.. అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించిన ప్రభుత్వం బాబాయి గొడ్డలి పోటు, చెల్లెలి కన్నీటి గాధలు పాఠ్యాంశంగా చేర్చుతారా..? అంటూ సెటైర్లు వేశారు. అమరావతి రాజధానిగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే.. భావితరాలపై కూడా అప్పుల భారం మోపుతుండటం దౌర్భాగ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.