చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. యాత్రకు వచ్చే రోజువారీ భక్తుల పరిమితిని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసింది… దీంతో… కీలక సూచనలు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న సర్టిఫికెట్ కానీ, 72 గంటలకు మించకుండా కోవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించాలని రూల్స్ పెట్టింది. చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది సర్కార్. కాగా, హిమాలయ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని.. ఉత్తరాఖండ్ హైకోర్టు తొలగించిన విషయం విదితమే కాగా.. ఒకరోజు తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కోసం కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOP) జారీ చేసింది.
కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం, చార్ ధామ్ ‘దర్శనం’ కోసం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరియు ఇ-పాస్ పొందడం తప్పనిసరి చేసింది.. ఈ యాత్రకు వచ్చే భక్తులకు రెండో డోసుల టీకాలు వేసుకున్న 15 రోజుల తర్వాత, టీకా సర్టిఫికెట్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, సంబంధిత జిల్లా యంత్రాంగం మరియు పోలీసు అధికారులు ‘చార్ ధామ్’ యాత్రలో సరైన కోవిడ్ మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కోరింది.