డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది… తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.. మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపండి అంటూ డిమాండ్ చేసిన ఆయన.. నలభై ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? అని ప్రశ్నించారు. మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరే ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతైనా నిరూపించగలిగారా? అంటూ సవాల్ చేశారు.
ఇక, సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటి కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్ ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకూ విస్తరించారంటూ సంచలన ఆరోపణలు చేసిన నారా లోకేష్.. రూ. 72 వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డీఆర్ఐ కేసులోనూ జగన్ నిందితుడేనని విమర్శించారు.. ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ , నెయ్యి వ్యాపారం మాది.. కానీ, జనం ప్రాణాలు తీసి.. లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి అని ఆరోపించారు.. సజ్జల విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. ఎస్.. నేను దుబాయ్ లో నా కుటుంబ సభ్యులతో వున్నా.. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైనా కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? సజ్జలా అంటూ సవాల్ విసిరారు. సజ్జల తీరు డ్రగ్స్ దొంగే.. దొంగా..దొంగా అని అరిచినట్టుంది ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.
Also Read
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!