CM Chandrababu: పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?.. ఎంపీ పుట్టా నిర్వాకంపై సీఎం ఫైర్!
- రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని అవకాశమిచ్చాం
- అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది
- పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రితో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. యువకుడిగా, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినందున అతనికి అవకాశం ఇచ్చామని, కానీ అతని ప్రవర్తన ఆశించిన విధంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
పుట్టా మహేశ్ యాదవ్ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశమిచ్చాం. కానీ ఈ విధంగా వ్యవహరించారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది?. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్ద వాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నా. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు’ అని సమావేశంలో సీఎం అన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం సూచించినట్టు తెలిసింది.
Also Read
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
Also Read: Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో పార్టీ చేసుకొంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌తో పాటు మరికొందరు దొరికిన విషయం తెలిసిందే. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు చెప్పినా.. పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఆ ఆరుగురిలో ఎంపీ పుట్టాకు కూడా ఉన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనపై ఎంపీ పుట్టా మాట్లాడుతూ.. ఫామ్‌హౌస్‌లో డిన్నర్‌కు హాజరైన మాట నిజమే అని, ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా అని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటా అని చెప్పారు.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!