Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న భారీ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విడుదలకు ముందే పెను దుమారం రేపుతోంది. నేడు సాయంత్రం 5 గంటల నుండి ప్లాన్ చేసిన పెయిడ్ ప్రివ్యూ షోల విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. కంటెంట్ డెలివరీలో జరిగిన తీవ్ర జాప్యం కారణంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల ప్రీమియర్ షోలపై డైలమా నెలకొంది.
Also Read : sreeleela : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజా సమాచారం ప్రకారం నేడు సాయంత్రం స్టార్ట్ అవ్వాల్సిన తెలుగు వెర్షన్ ప్రీమియర్ షోలన్నీ దాదాపు రద్దయ్యాయి. చివరి నిమిషంలో జరిగిన రీ-ఎడిటింగ్ పనుల వల్ల సినిమా సెకండ్ హాఫ్ కంటెంట్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు సకాలంలో అందలేదు. దీనివల్ల షోలు నిర్వహించడం అసాధ్యంగా మారింది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది తెలుగు ప్రేక్షకులు ఈ వార్తతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. హిందీ వెర్షన్ షోలు కొన్ని చోట్ల యధావిధిగా ప్రదర్శిస్తున్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ ప్రాంతీయ భాషల్లో మాత్రం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది.
Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?
పరిస్థితి కాస్త అనుమానంగా ఉండడంతో PVR INOX వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అన్ని ప్రాంతీయ భాషలకు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) సంబంధించిన ప్రీమియర్ షో బుకింగ్స్‌ను తక్షణమే నిలిపివేశాయి. కంటెంట్ ఇంకా డౌన్లోడ్ కాకపోవడం, ప్రొసెసింగ్‌కు మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో హార్డ్ డిస్క్ డెలివరీపై ఆధారపడిన థియేటర్లలో షోలు క్యాన్సిల్ చేయడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.ఈ గందరగోళంపై చిత్ర నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్ల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దాదాపురూ. 150 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో, ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్లపై పెద్ద దెబ్బేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!