ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. ఏపా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 46,558 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 800 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇక, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పు, చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున తాజాగా 9 మంది మృతిచెందారు. ఇదే సమయంలో 1,178 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కారు.
మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,85,64,548కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,54,663కు పెరిగింది. ఇప్పటి వరకు 20,31,681 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,228 మంది ప్రాణాలు తీసింది కరోనా.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,754 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి 126, చిత్తూరులో 120, గుంటూరులో 111, పశ్చిమ గోదావరిలో 104 కొత్త కేసులు వెలుగు చూశాయి.