విశాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసును చేధించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు.. డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేశారు.. వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లు మెసేజ్ పంపించి ఎర వేశారు.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసింది మహిళ.. ఇక, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. డబ్బులు ఇవ్వకపోతే […]
చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు.. ఇజ్రాయెల్‌పై గురిపెట్టిన చైనా హ్యాకర్లు.. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను సంబంధించిన డాటాను చోరీ చేశారు.. ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫస్ట్ ఐ’ వెల్లడించింది. పలు కంపెనీల ఫైనాన్స్, టెక్నాలజీ, వ్యాపారానికి సంబంధించిన డాటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొంది.. ఆ డాటాలో యూజర్ డాటా కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు… ఫస్ట్ ఐ పేర్కొన్న ప్రకారం.. డ్రాగన్ […]
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్ వేవ్‌లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు […]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం వెళ్లనున్నారు.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షా… ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడే లంచ్ చేసి.. తిరిగి హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అనంతరం తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.. మొత్తంగా.. […]
ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంతో పాటు స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదన్నారు.. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం.. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. యువత భవిష్యత్తున్ దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 482 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 455 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,50,835కు చేరుకోగా… ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 3,833కు పెరిగింది.. ఇక, […]
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను ఎట్టకేలకు పూర్తి చేసింది కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుల టీమ్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేఆర్ఎంబీ.. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన తర్వాత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ టీమ్ […]
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. తాజాగా మరోసారి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. మాన్సాన్ ట్రస్ట్ విషయంలో నా నియామకంపై హైకోర్టు మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.. వరసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడంలేదని మండిపడ్డారు.. కోర్టులో ప్రభుత్వానికి ప్రతిసారి చుక్కెదురవ్వడంపై ఆలోచించుకోవాలని సూచించిన ఆయన.. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం మాన్సాస్ వ్యవహారంలో తలదూర్చిందన్నారు.. ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్ […]
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై మంటలు చెలరేగిన ఘటన కలకలం సృష్టించింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డలో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది.. దీంతో.. అవనిగడ్డలోని సీతాయమ్మ హోటల్ సెంటర్ వద్ద భూమిపై మంటలు చెలరేగాయి… వెంటనే స్పందించిన గ్యాస్ సిబ్బంది.. పైప్ లైన్ రిపేర్ వర్క్ ప్రారంభించారు. ఒక్కసారిగా భూమిపై మంటలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ మంటల వలన […]
కరోనా మహమ్మారి రోజుకో కొత్త వైరస్‌లో వివిధ వేరియంట్లలో భయపెడుతూనే ఉంది.. ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది డెల్టా వేరియంట్.. అయితే, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతాయనే దానిపై పలు వాదనలు ఉన్నాయి.. కొన్ని అధ్యయనాల్లో.. అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనేది కూడా తేల్చాయి.. తాజాగా.. రష్యా తయారు చేసిన పై స్పుత్నిక్ వి.. […]