కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అసలు దళితులు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… వైసీపీ దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు… దళితులకు నాగరికత లేదని మాట్లాడే ఆదినారాయణరెడ్డికి అసలు దళితుల ఓట్లు అడిగే హక్కులేదన్న ఆయన.. దళితులు ఎవ్వరూ బీజేపీకి ఓటు వేయొద్దని సూచించారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టిందని ఆరోపించారు నారాయణస్వామి… దళితులంతా బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించాలని కోరారు నారాయణస్వామి.