మరోసారి సవాళ్ల పర్వం తెరపైకి వచ్చింది.. తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను చెప్పే అంశాలపై కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.. కేటీఆర్‌తో చర్చకు తానే స్వయంగా వస్తానన్న రేవంత్… అయినా.. తమ పార్టీలో సీనియర్ల గురించి మాట్లాడేందుకు కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇక, తాము ఏదైనా అంటే కోర్టుకు పోతారని.. అయినా పిరికివాళ్ల గురించి ఏం మాట్లాడుతాం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లింగోజీగూడలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి వచ్చినా మూసీలోకి తొక్కేశామంటూ వ్యాఖ్యానించారు.
కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెలుతుందా? అని కేటీఆర్ కామెంట్ చేశారు.. ఓడిపోయిన వాళ్లు సన్యాసం తీసుకోవాలన్నారు.. మరి సొంత చెల్లి ఓడిపోయింది సిగ్గుండాలి.. ఏం మొఖం పెట్టుకుని వచ్చాడంటూ రేవంత్ ఫైర్ అయ్యారు నిజామాబాద్‌లో సొంత చెల్లినే గెలిపించుకోలేదు.. అలాంటి వాళ్లు కూడా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేటీఆర్ తీరు బరితెగించిన కోడు బజార్లకు వచ్చి గుడ్డు పెట్టినట్టుంగా ఉందని సెటైర్లు వేసిన రేవంత్.. అయ్య (కేసీఆర్) ఏదో జమ చేసిండు.. దానిని చూసుకొని కేటీఆర్ మురిసిపోతున్నాడని ఎద్దేవా చేసిన పీసీసీ చీఫ్.. ఇద్దరికీ తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఇలాంటి వ్యవహారాలు లేకుండా.. కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి.. అభివృద్ధా? రాజకీయమా? ఎన్నికలా..? ఏదైనా సరే.. కేటీఆర్ నిర్ణయించిన ఏజెండాపై చర్చకు నేను సిద్ధం.. మరి కేటీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.