తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు సంచలనం సృష్టించింది.. 2019లో జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురికాగా.. మరోసారి ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.. ఏకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌నే నిందితులు బెదిరించండం సంచలనంగా మారింది.. ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు సాక్షులు, పీపీకి బెదిరింపు లేఖలు రాసినట్టుగా గుర్తించారు.. ముఖ్యమైన సాక్షులను బెదిరించి కేసు నుండి బయట పడేందుకు పక్కా ప్లాన్ వేశారు నిందితులు.. జైలులో ఉన్న రాకేష్ రెడ్డి లెటర్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. సాక్షులను బెదిరిస్తూ లేఖలు రాశారు.. ఇక, రాకేష్ రెడ్డి సూచనలతో వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు అక్బర్ అలీ అనే వ్యక్తి.
చిగురుపాటి జయరాం హత్య కేసులో పీపీని రాకేష్ రెడ్డి అనుచరులు అక్బర్ అలీ, గిప్త, శ్రీనివాస్ బెదిరింపులకు గురిచేసినట్టుగా గుర్తించారు.. జయరాం హత్య కేసుల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూకర్ పై ఒత్తిడి తెచ్చారు.. ఈ వ్యవహారంలో రాకేష్ రెడ్డితో చంచల్ గూడ జైలులో పనిచేస్తున్న నర్స్ అక్బర్, అతని స్నేహితులు గుప్తా, శ్రీనివాస్ కుమ్మక్కైనట్టుగా తెలుస్తోంది… రాకేష్ రెడ్డి సూచనలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు సాక్షులను బెదిరింపులకు పాల్పడ్డారు నిందితులు.. కాగా, ఈ కేసులో కొందరు పోలీసు అధికారులపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే.