విద్యార్థులు, విద్యా విధానంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది కరోనా మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడి.. ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేయడమే కాదు.. ఎన్నో పరీక్షలను కూడా రద్దు చేసింది.. కీలకమైన బోర్డు ఎగ్జామ్స్‌కు రద్దు చేసి.. అందరు విద్యార్థులను పాస్ చేసిన పరిస్థితి.. అయితే, ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ… ఎంసెట్ అడ్మిషన్స్, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా, 5 సంవత్సరాల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కి అర్హత.. ఇంటర్ […]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి… ఓవైపు పెగాసస్ వ్యవహారం.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. ఇలా రకరాల సమస్యలపై నిత్యం పార్లమెంట్ ఉభయసభల్లో ఏదో ఒక రచ్చ జరుగుతూనే వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. లోక్‌సభను ఇవాళే నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.. ఇక, ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 21.14 గంటలు మాత్రమే పనిచేసింది… విపక్షాల నిరసనల కారణంగా ఏకంగా […]
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత పురోగతి సాధించారు సీబీఐ అధికారులు… వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. రహస్యంగా ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగింది.. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సీబీఐ.. చివరకు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. జిల్లాలోని 20 మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ […]
ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాంగం సృష్టిస్తున్నారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నాలుగు రెట్లు ఎక్కువగానే సీఎం జగన్.. బీసీలకు రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. దేశంలో ఏ సీఎం కూడా బీసీలకు రాజ్యాంగం రాయలేదు.. కానీ, బీసీలకు రాజ్యాంగం రాస్తున్న మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అంటూ కీర్తించారు.. బీసీలను తన పక్కన కూర్చొపెట్టుకున్నారు.. మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు ఇచ్చి […]
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం.. హుజురాబాద్ కంటే ముందుగానే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలుకు పూనుకున్న సర్కార్.. ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది.. అయితే, దళిత బంధు ప్రకటించిన తర్వాత.. రకరకాల బంధులు తెరపైకి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావు… దళితులకు దళిత బంధు […]
నాకు కేవలం 2 గుంటల భూమే ఆస్తి.. ఓ పని మనిషిలా పని చేస్తా.. అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని హుజురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్.. స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నాకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలకు సేవ చేయమన్న సీఎం కేసీఆర్ కి పాదాభివందనం అన్నారు.. నేను పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను.. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశాను… […]
కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్‌రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ […]
చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఇవాళ్టి హైకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున అస్సిటెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు.. ఇదే సమయంలో… బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు… 2019 వోసీఐ కార్డ్ బెర్లిన్ లో ఇండియన్ అంబసి ద్వారా చెన్నమనేని తీసుకున్నాడని కోర్టుకు వివరించారు.. వోసీఐ దరఖాస్తు ఫామ్ 10 కాలంలో నేషనాలిటీ […]
ఇప్పటికే కరోనా వైరస్ కలవరపెడుతోంది.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. మరోవైపు.. పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చినట్టే కనిపించడం లేదు.. ఈ తరుణంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు కలవరడానికి గురిచేస్తోంది.. ఆఫ్రికా దేశం గినియాలో మార్బర్గ్ అనే వ్యాధి బయటపడింది.. ఎబోలా, కోవిడ్ లాంటి వైరస్ల తరహాలోనే మార్బర్గ్ కూడా ప్రాణాంతమైందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ […]