వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్… ఇవాళ రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు.. మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలిశారు.. తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రికి అందించారు. ఇక, ఆ తర్వాత వేములవాడ అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్.. అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20 కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం […]
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్ […]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. పోలీసులపై పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతో పాటు కొన్ని వస్తువులని ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్న ఆమె… దీనిపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. భూమి పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని.. ఇది బోయిన్పల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ.. ఈ ఘటనపై కూకట్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు ఇచ్చారు.. తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు […]
క్రిమినల్ రికార్డులు ఉన్న నేతలే.. ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపడుతున్నారు.. ప్రజలను పాలిస్తున్నారు.. అయితే, రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం… ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన […]
దేశ్యాప్తంగా చర్చగా మారి.. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ స్కామ్‌పై విచారణను మరోసారి వాయిదా వేసింది సుప్రీంకోర్టు… గత విచారణ తర్వాత ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం.. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై కలిసి విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన […]
తాజాగా బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో […]
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది… తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఆయుధాల కోసం తవ్వకాలు నిలిపివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సీబీఐ… దీంతో, రోటరీపురం, గరండాల వాగు వద్ద తవ్వకాలు నిలిపివేశారు.. బారికేడ్లు తొలగించి పోలీసుల పికేటింగ్‌ను ఎత్తేశారు అధికారులు.. ఇక, ఆ రహదారి గుండా యథావిథిగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు.. కాగా, మూడు రోజుల పాటు తవ్వకాలు చేసినా ఆయుధాలు లభించలేదు.. మురికి […]
భారత్‌లో కరోనా రోజువారి కేసులు కొన్నిసార్లు స్థిరంగా కొనసాగుతున్నా.. మరికొన్నిసార్లు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య 30 వేల దిగువకు పడిపోయింది… ఇంత తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం 147 రోజుల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,11,313 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 28,204 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 373 మంది కరోనా బాధితులు […]
మరోసారి తెలంగాణను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతోంది… హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల కోసం ప్రజలు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రెండో డోసు అయినా.. మొదటి డోసు అయినా ఏం తేడా లేదు.. తెల్లవారుజామునే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు… అయితే, ఒక్కో పీహెచ్సీలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసుతున్నారు సిబ్బంది.. దీంతో.. మిగతావారు వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు లక్ష మందికి పైగా వ్యాక్సిన్ […]
ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి […]