భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… మరోసారి 40 వేల మార్క్‌ను దాటి పైకి కదిలాయి కొత్త కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 490 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 39,069 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. […]
కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. యడియూరప్ప సీఎంగా రాజీనామా చేశాక… ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బసవరాజు బొమ్మైకి… అసంతృప్త నేతలతో తలనొప్పులు మొదలయ్యాయి. కేబినెట్లో శాఖల కేటాయింపు విషయంలో… పలువురు మంత్రులు బహరింగంగానే అసహనం వ్యక్తం చేయడం… పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే… కోరుకున్న శాఖ రాలేదని… పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారని సమాచారం. నేడో, రేపో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బొమ్మై మాత్రం… […]
7.1 తీవ్రతతో బలమైన భూకంపం ఫిలిప్పీన్స్‌ను తాకింది.. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో ఈ భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది… పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. ఇంత భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పుడు.. సాధారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వివిధ ఏజెన్సీలు […]
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. రూ.47,300 వద్దే కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.43,350 వద్దే స్థిరంగా ఉంది.. ఇదే సమయంలో వెండి ధర మరింత కిందకు దిగింది.. రూ.300 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.67,900కు పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కిందకు దిగింది.. ఔన్స్‌కు 0.07 శాతం తగ్గడంతో పసిడి […]
మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ బైక్ రోడ్డుపై 300 మీటర్లకు పైగా ప్రయాణించింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో బైక్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. డ్రైవర్ లేకుండా బైక్ దూసుకెళ్లడం ఏంటనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే… వేగంగా వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను కింద పడిపోయాడు. కానీ, బైక్ మాత్రం 300 మీటర్లు ప్రయాణించి రోడ్డుపై పడిపోయింది. ఎవరికీ ప్రమాదం […]
కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ సైతం యుద్ద ప్రాతిపధికన సాగుతోంది. అయితే, కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. భారత్‌లో ఎప్పుడెపుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. పెద్దలకు టీకా అందింది కానీ పిల్లలకు ఇప్పటి వరకు టీకా ఇవ్వట్లేదు. మరోపక్క స్కూళ్లు, కాలేజీలకు పంపలేని పరిస్థితి కరోనా సెకండ్వేవ్తగ్గినట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావటం లేదు. ఇప్పటివరకు […]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో షా పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి., అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25కు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్కడి […]
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నింగికెగిసిన జీఎస్ఎల్బీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. రెండో దశ తర్వాత రాకెట్లో సమస్య తలెత్తింది. రెండు స్టేజ్‌ల వరకు విజయవంతంగా నింగిలోకి వెళ్లిన రాకెట్… మూడో దశలో గతి తప్పింది. ఎఫ్ 10 రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్ – 1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టే క్రమంలో.. మూడో దశలో సమస్య తలెత్తినట్లు ఇస్రో తెలిపింది. ఈ ఏడాది ఇస్రో చేసిన రెండో ప్రయోగం […]
మేషం : ఈరోజు మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడతాయి.. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది. వాహనం నపుడునపుడు మెళకువ అవసరం. వృషభం : ఈ రోజు ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. స్త్రీలు బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వ్యాపారాల్లో సరి కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మిథునం : ఈ […]
వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఎస్పీలో చేరారు.. ఈ సందర్భంగా నల్గొండ వేదికగా భారీ బహిరంగసభ నిర్వహించారు.. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి బలప్రదర్శన చేశారు.. జనసమీకరణకు విద్యార్థుల నుంచి వివిధ వర్గాల వరకు ఆయనకు మద్దతు లభించింది.. బహిరంగసభకు హాజరైన జనాన్ని చూస్తే.. వాళ్లు పెట్టిన ఎఫెక్ట్ కనిపిస్తుంది.. అయితే, ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్ రాధపై బదిలీ వేటు పడడం చర్చగా మారింది.. పీఏ పల్లి […]