సీఎంగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదు.. వెంటనే రాజీనామా చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదు.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హుజురాబాద్‌లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అన్నారు.. రెండు నెలలలోపు హుజురాబాద్ లో అందరికి “దళిత బంధు” ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళిత బంధును బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని విమర్శించారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి 10 వేల రూపాయలు ఇస్తామన్నారు.. ఇప్పటికి ఇవ్వలేదని ఆరోపించిన ఆమె.. 10 వేల రూపాయలు ఇవ్వొద్దని బండి సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా దొంగ లేఖ సృష్టించారని మండిపడ్డారు.
హుజురాబాద్‌లో రెండు నెలలుగా దళిత బంధు అమలు చేయకుండా ఏం చేశారు.. హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు డీకే అరుణ.. ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం తెచ్చిన అబద్దపు హామీ, మోసం తేట తెల్లమైందన్నారు. బీజేపీ “దళిత బంధు” ఆపింది అన్న అసత్య ప్రచారాలు టీఆర్ఎస్ ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. దళితులకు ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నారు.. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. యాదగిరి నరసింహ స్వామి మోసాలు చేయమని చెప్పాడా? అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. “దళిత బంధు” ఆపమని బీజేపీ లేఖ రాస్తే ఆ లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు. ఎన్నికల కోసం పథకాలు కాదు.. రాష్ట్ర సంక్షేమం కోసం పథకాలు ఉండాలని.. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు.. పంట నష్ట అంచనా వేయలేదు… “రైతు బంధు”ఇచ్చామని ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Tags
- bjp
- cm kcr
- DK Aruna
- Huzurabad bypoll
- kcr
తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..