కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు… ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన.. ఆ తర్వాత హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకున్నారు.. అక్కడ షాకు ఘనస్వాగతం లభించింది.. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఇక, ఆ తర్వాత శ్రీశైలం […]
క్రమంగా ఆఫ్ఘనిస్థాన్‌పై పట్టు సాధిస్తున్నారు తాలిబన్లు.. త్వరలోనే ఆఫ్ఘన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంటామని ముందుకు కదులుతున్న తాలిబన్ ఫైటర్లు.. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు భారత్ బహుమతిగా ఇచ్చిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.. భారత్ ఇచ్చిన గిఫ్ట్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు తాలిబన్లు. ఆ హెలికాప్టర్ పక్కన తాలిబన్లు నిలబడి ఉన్న ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేవారు.. అయితే, అది ఉపయోగించడానికి వీలు లేకుండా […]
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం… త్వరలోనే ఎన్జీటీ, కేంద్రానికి దీనిపై నివేదిక సమర్పించనున్నారు.. మరోవైపు.. లేఖలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది… ఇశాళ కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ సి. మురళీధర్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని లేఖలో పేర్కొన్నారు మురళీధర్.. మరి తెలంగాణ […]
ఆ మధ్య వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ టాప్ లీడర్లకు షాకిచ్చిన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఇప్పుడు ఫోకస్ కాంగ్రెస్ నేతలపై పెట్టినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. మొన్నటి మొన్న రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను.. ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురు నేతల అకౌంట్లను నిలిపివేసింది.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్ […]
నేతల క్రిమినల్ రికార్డులపై రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా ఉందని.. అందుకే సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతిని కలిసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన […]
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. తన హయాంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు.. టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్ది వేచిచూసిన సందర్భాలకు చెక్ పెడుతూ.. ఫాస్ట్‌ట్యాగ్ లాంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.. అయితే.. త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తామని వెల్లడించారు గడ్కరీ.. ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై టోల్ సేకరణ కోసం ప్లాజాలకు […]
ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.. కొన్ని సార్లు గొంతు సవరించాల్సి వస్తే.. మరికొన్ని సార్లు కాలు కదిపి స్టెప్పులు కూడా వేయాల్సి వస్తుంది… తాజాగా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది… సింగర్‌గా మారిపోయిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలేష్ విజయ్‌వర్గీయతో కలిసి పాటందుకున్నారు.. భోపాల్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు దిగ్గజ నేతలు.. ప్రముఖ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ నిబంధనలతో వైరస్‌ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ […]
మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పులు జరపడం.. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో.. చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి… అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు… అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్మెన్లు కూడా ఉన్నట్టుగా […]
హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం అందికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ… విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపింది.. మరోవైపు.. తన నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు జరుగుతున్నా.. ఆయనే అభ్యర్థి అని ఇప్పటి వరకు అధిష్టానం తేల్చింది లేదు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి వేటలో ఉంది.. అయితే, గెల్లు శ్రీనివాస్ యాదవ్.. కేసీఆర్ బానిస అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేయడంపై […]