తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర […]
ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్‌రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై […]
సెప్టెంబర్ 1న జరగబోయే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో… సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ […]
మెడికల్ టూర్ నిమిత్తం రేపు కేరళ వెళ్లనుంది ఆంధ్రప్రదేశ్ బృందం.. ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళలోని వైద్య విధానాలను అధ్యయనం చేయనుంది ఆంధ్రప్రదేశ్ టీమ్.. కేరళ ప్రభుత్వం అవలంభించిన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలనూ పరిశీలించనున్నారు ఏపీ అధికారులు.. కేరళ వైద్య విధానాలను ఏపీలో అవలంభించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాగా, సీఎం వైఎస్ జగన్ సూచనలతో కేరళ వెళ్లనుది ఏపీ అధికారుల బృందం. మరోవైపు.. కేరళలో కరోనా మొదటి దశలో.. రెండో వేవ్‌లోనూ […]
ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని సరిగా లేదని… అయన్ను వెంటనే మార్చాల్సిందేనని సిద్ధూ వర్గం నేతలు పట్టుబట్టారు. అవసరం అయితే, సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఇంతలోనే పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు హరీష్‌రావత్… అసంతృప్తవర్గానికి చెందిన నలుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరించారని […]
భారత్‌లో కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మరికొన్నిరోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి.. 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తై, కోవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోంది. దాని వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా ఉంది.. […]
ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ చలాన్ల వ్యవహారం సంచలనం సృష్టించింది.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆ స్కామ్ వెనుక ఉన్నవారి బరతపడుతోంది.. బోగస్ చలానాల వల్ల పక్కదారి పట్టిన నిధులు.. రూ.7.14 కోట్లుగా గుర్తించామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. బోగస్ చలాన్ల స్కాంలో ఇప్పటి వరకు 3 కోట్ల 39 లక్షలు రికవరీ అయ్యాయన్నారు. ఇక కొత్త సాఫ్ట్ వేర్‌తోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని.. అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు ధర్మాన. […]
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా.. కేరళలో మాత్రం భారీగానే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ వచ్చాయి.. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూవాయి.. కేరళ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,445 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 215 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.03గా నమోదైంది.. మళ్లీ కోవిడ్ […]
ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి […]
తెలంగాణలో మరోసారి సవాల్ పర్వం తెరపైకి వచ్చింది… మంత్రి మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం సైతం కబ్జా చేసిందేనంటూ.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఇక, దీనిపై మంత్రి మల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.. ఆ వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి.. రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి మల్లాడిరెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఏకవచన వ్యాఖ్యలతో విరిచుకుపడ్డ మల్లారెడ్డి.. రాజీనామా చేద్దాం.. […]