త్వరలోనే పార్టీ పెడుతున్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానంటూ ప్రకటించిన ఓ మాజీ ఐపీఎస్ అధికారిని ఒక్కరోజు తిరగకుండానే ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది… అయితే, అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు చెబుతున్నారు.. కాగా, బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 24 ఏళ్ల యువతి.. తన […]
ఆఫ్ఘన్నిస్థాన్లో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన అమెరికా.. ప్రతీకార దాడులు తప్పవని.. వారిని వెంటాడి వేటాడి చంపుతామని వార్నింగ్ ఇచ్చింది… ముందు ఉగ్రవాదుల బాంబుల మోత, వెనక తాలిబన్ల హెచ్చరిక. ఆఫ్ఘన్ దాటాలి అనుకునే వారికి ఆగస్టు 31 ఆఖరు తేది. ఇది వారి ప్రాణాలకు చివరితేదీగా మారింది. ఈ ఐదు రోజుల్లో దేశం దాటిన వాళ్లు ప్రాణాలతో ఉన్నట్టు. మిగిలి పోయిన వాళ్లు తాలిబన్ల చేతుల్లో చచ్చినట్టే. అప్ఘానిస్తాన్‌లో ఉన్నవారిలో ఇప్పుడు కనిపిస్తున్న భయం ఇదే. మిగిలిన […]
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్‌వర్క్ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు […]
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ స్పెషల్ కోర్టు-1 అదనపు జడ్జిగా వరప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది న్యాయస్థానం… ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోర్టు న్యాయమూర్తిగా కె.జయకుమార్ ను నియమించింది. జస్టిస్ జయకుమార్ ప్రస్తుతం వరంగల్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. తెలంగాణ […]
ఆఫ్ఘన్లో పరిస్థితులపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు కాల్పులు జరిపి… 9 ఏళ్లు పూర్తవుతున్నా… ఓ బుల్లెట్ గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని మలాలా తెలిపారు. గత 40 సంవత్సరాలుగా దేశ ప్రజలు… లక్షల కొద్దీ బుల్లెట్లను ఎదుర్కొంటూనే ఉన్నారని వెల్లడించారు. ఆఫ్ఘన్లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులపై స్పందించారు. తాలిబన్ల చర్యలతో […]
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో… కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఒక రాష్ట్రం వివాదం ముగిసిందనుకుంటే… మరో రాష్ట్రంలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా… నాయకులు గళమెత్తుతున్నారు. మొన్న రాజస్థాన్, నిన్న పంజాబ్, తాజాగా చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్ వ్యవహారం క్లోజ్ అయిందనుకుని… ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త లొల్లి షురూ అయింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… […]
కాబూల్ బ్లాస్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 150 దాటిందని తెలుస్తోంది. మరికొంత మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటు కాబూల్ ఎయిర్ పోర్టుకు ఉగ్రవాదుల నుంచి మరోసారి ముప్పు పొంచి ఉందని అమెరికా సహా అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు బాంబు దాడుల భయం ఉన్నా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎయిర్ పోర్టు గుంపులు గుంపులుగా తరలి వస్తూనే ఉన్నారు. ఇటు, […]
అగ్రరాజ్యం అమెరికా, తాలిబన్లు ఒక్కటైపోయారా ? దళాల ఉపసంహరణ నిర్ణయం తర్వాత… తాలిబన్లు అమెరికా సైన్యానికి సహకరిస్తున్నారా ? నాటో దళాల తరలింపునకు… తాలిబన్లు దగ్గరుండి సాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్లు… ప్రజలను అడ్డుకుంటున్నా… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలకు వెళ్లేందుకు శరణార్థులుగా వచ్చిన వారిపై కాల్పులు జరిపినా… తమకేమీ తెలియనట్లు నటించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా… పట్టించుకోలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పు మీద తప్పు […]
మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర సరిహద్దుల్లో 90 ఎంఎల్ పరిమాణంలో మద్యం అమ్మకాలకు మాత్రమే ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అక్రమ రవాణా, నాటు సారా, గంజాయి వినియోగం తగ్గించేందుకు క్యాన్ బీర్ బాటిళ్లకు అనుమతించలేదని.. 90 ఎంఎల్ లిక్కర్‌కు అనుమతిచ్చామంటోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ పరిధిలోని కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు నిర్ణయం తీసుకుంది.. […]
కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించారు.. ఇక, సమీక్ష తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన తెలంగాణ సీఎం.. సిద్దిపేట జిల్లాకు రాగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు.. తొగుట మండలం తుక్కుపూర్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను హెలికాప్టర్ నుంచి వీక్షించారు.. కాగా, ఇప్పటికే ఆరు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.. ఈ ఏడాది పది టీఎంసీల […]