రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోతోంది.. కొత్త కొత్త మోడల్స్‌లో వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.. ఇప్పటికే డ్రైవర్ అవసరం లేకుండానే పార్కింగ్ చేసుకొనే కార్లు, డ్రైవింగ్ సీట్లో ఉన్నవాళ్లకు నిద్ర వస్తుంటే హెచ్చరించే కార్లు.. లైన్ తప్పితే వార్నింగ్ ఇచ్చే కార్లు.. లాంగ్‌రూట్ కాకుండా షాట్ రూట్స్ చూపించే కార్లు.. ఒక్కటేంటి.. ఇలా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.. కొత్తగా వచ్చే మోడల్‌లో ఏదో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు.. తాజాగా జపాన్ కంపెనీ మజాద్ కొత్త కారును తయారు చేస్తోంది.. డ్రైవింగ్ సీట్లో ఉన్నవారు గుండెపోటు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కోపైలట్ మోడ్‌లో.. కారు దానంతట అదే వెళ్లి ఆగిపోతాయని కార్ల తయారీ సంస్థ చెబుతోంది.
Read Also: యోగి ఆసక్తికర వ్యాఖ్యలు… బీజేపీ నిర్ణయం తర్వాతే బరిలోకి..!
అయితే, తాము తయారు చేస్తున్న ఈ కార్లు 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని మజ్‌దా ప్రకటించింది.. కాసేపట్లో గుండె నొప్పి రాబోతోందని హెచ్చరించే విధంగా కూడా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించింది.. కారులో ఏర్పాటు చేసే కెమెరాలు మనిషిలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పసిగడతాయని.. ఆ మార్పులను విశ్లేషించి గుండెపోటు లేదా ఇతర అనారోగ్య సమస్యల సంకేతాలను గుర్తిస్థాయని.. డ్రైవర్‌కు అనారోగ్య లక్షణాలు కనిపించగానే కారులోని కోపైలట్ వ్యవస్థ డ్రైవింగ్ బాధ్యతలు స్వీకరిస్తుందని.. ఆ తర్వాత జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత కారును రోడ్డు పక్కన ఆపేస్తుందని చెబుతున్నారు.. అంతేకాదు.. ఆ సమయంలో.. పెద్ద శబ్ధం చేయడం.. ఆటోమెటిక్‌గా లైట్లు రావడం, పోవడం చేస్తే.. పక్కవాళ్లను అప్రమత్తం చేస్తుందని.. ఈ పరిస్థితిని ఎవరైనా గమనించి వారికి సహాయపడేట్లు సిగ్నల్స్ ఇస్తుందని వెల్లడించారు. ఇక, పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేసే వ్యవస్థను కూడా అందులో ఏర్పాటు చేస్తామని చెబుతోంది మజాద్. వాహనాలను నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్లు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. దీంతో.. ఆ వాహనాల్లో ఉన్నవారు కూడా మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి.. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పడనుంది.