దీపావళి వేళ సర్కార్‌కు కాసుల పంట..! రూ.443 కోట్ల మద్యం తాగేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి అంటే పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది.. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు.. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ మద్యం అమ్మకాలను ముందే ఊహించిన సర్కార్.. మద్యం స్టాకు కూడా పెంచింది.. కావాల్సిన మద్యాన్ని సమకూర్చింది.
Read Also: నేడు హైదరాబాద్‌లో ‘సదర్’.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్తే అంతే..!
Also Read
ఇక, దీపావళికి ముందు రోజు.. దీపావళి నాడు మద్యం విక్రయాలను ఓసారి పరిశీలిస్తే.. 3వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా రూ.213.61 కోట్ల మేర మద్యాన్ని విక్రయించారు. చెన్నైలో రూ.38 కోట్లు, మదురైలో రూ.47.21 కోట్లు, సేలంలో రూ.44.27 కోట్లు, తిరుచ్చిలో రూ.43.38 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.75 కోట్లు మేరకు టాస్మాక్ దుకాణాలలో మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇక, 4వ తేదీన మద్యం విక్రయాలు మరింత పెరిగాయి… 4న ఏకంగా రూ.228.42 కోట్ల మేరకు మద్యం అమ్మకాలుసాగాయి.. చెన్నైలో రూ.41.84 కోట్లు, మదురైలో రూ.51.68 కోట్లు, సేలంలో రూ.46.62 కోట్లు, తిరుచ్చిలో రూ.47.57 కోట్లు, కోయంబత్తూరులో రూ.41.71 కోట్ల మేరకు మద్యం విక్రయాలు సాగినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా.. దీపావళి వేళ.. పూలు, పండ్లు, స్వీట్లు.. టపాసులకే కాదు.. మద్యానికి కూడా మంచి గిరాకీ తగిలింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!