హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ప్రాణాలు వదిలింది.. పీజీ చేస్తున్న మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలింది… హెచ్‌సీయూలోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే మౌనిక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.. చదువు ఎంత చదివినా నా మనసులోకి ఎక్కడం లేదని సూసైడ్‌లో మౌనిక పేర్కొన్నట్టు తెలియజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ […]
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేసింది.. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని కారణం.. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ […]
మియాపూర్‌లో కలకలం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 జనవరి 19వ తేదీన ఓ మహిళపై హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో సామూహిక అత్యాచారం జరిగింది.. ఏడుగురు కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఎల్బీనగర్ న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితులకు జీవితఖైదు […]
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. అయితే, కాబూల్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతాల్లో ఇంకా అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి… అ నేపథ్యంలో అమెరికాకు డెడ్‌లైన్ పెట్టారు తాలిబన్లు… ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు అమెరికా.. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పెట్టింది.. అయితే, అమెరికా పెట్టుకున్న ఆ గడువు పెంచితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తాలిబన్లు.. ఆగస్టు […]
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది… […]
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోన్నాయి.. అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునర్ ప్రారంభించాలని ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించారు సీఎం […]
తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 74,634 శాంపిల్స్ పరీక్షించగా… 354 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 427 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,55,343కు పెరగా.. 6,45,174 మంది బాధితులు పూర్తిస్థాయిలో రికవరీ అయ్యారు.. […]
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో బీసీ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న వకుళాభరణం కృష్ణమోహన్‌ను ఇప్పుడు చైర్మన్‌ను చేశారు సీఎం కేసీఆర్… ఇక, బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్రను నియమించారు.. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించనుంది సర్కార్.. ఇక్కడో […]
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం… విద్యా సంస్థలు తెరవచ్చని నివేదిక ఇచ్చింది వైద్య ఆరోగ్యశాఖ.. దీంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.. 1వ తేదీ నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్… విద్యాశాఖ మంత్ర సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో.. ఇవాళ విద్యాశాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. దీనిని […]
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్ పైప్లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు […]