తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 80,568 శాంపిల్స్ పరీక్షించగా… 339 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 417 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్ […]
సంవత్సరం క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసుల దర్యాప్తు సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేధింపుల సమస్యలతో మహిళా మృతి ఘటన ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మృతి చెందింది. అయితే, ఉత్తర మరణంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది… ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్ […]
ఆఫ్ఘనిస్థాన్‌లో వరుసగా బాంబు పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి… దేశ రాజధాని కాబూల్ సైతం తాలిబన్ల వశం అయిన తర్వాత ఈ పేలుళ్లు కలవరపెడుతున్నాయి.. దీంతో.. ఆఫ్ఘన్లో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నేథప్యంలో.. భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.. ఇప్పటి వరకు ఆఫ్ఘన్ నుంచి 550 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు వెల్లడించింది.. ఆరు ప్రత్యేక విమానాల ద్వారా 550 మందిని భారత్‌కు తరలించామని.. అందులో 260 మంది భారతీయులు […]
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9 […]
మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ చివరకు సీఎం కేసీఆర్ పైకి మళ్లింది… గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌పై స్పందించిన ఆయన.. సవాల్ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు.. […]
మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్ […]
అప్పట్లో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. అయితే, ఈ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.. గతంలో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను విచారించిన ఈడీ.. కెల్విన్, పీటర్, కమింగా నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది.. ముగ్గురి స్టేట్మెంట్ ల ఆధారంగా విచారణనులో దూకుడు పెంచింది.. కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ నటులకు నోటీసులు జారీచేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, డ్రగ్స్ తీసుకుని హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా […]
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు […]
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం జరిగినా.. పనుల్లో జాప్యం జరగకుండా చ్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలవరం పునరావాస పనులపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది నేషనల్ ఎస్టీ కమిషన్.. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.. పోలవరం బాధితుల నుంచి […]