నేడు హైదరాబాద్‌లో ‘సదర్’.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్తే అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.. ఒక్కప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్‌లు, గ్రామాలకు కూడా విస్తరించింది.. అయితే.. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు యాదవ సోదరులు.. ఇప్పటికే శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సదర్ ఘనంగా జరగగా.. రెండో రోజులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, కాచిగూడ, ఈస్ట్ మారెడ్‌పల్లి సహా మరికొన్ని ప్రాంతాలతో పాటు.. నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో కూడా సదర్ ఉత్సవాలు జరగనున్నాయి.. ఇక, నారాయణగూడ వైఎంసీఏ కూడలి సదర్ ఉత్సవానికి ముస్తాబైంది.. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలతో పాటు.. ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
సదరు ఉత్సవాల నేపథ్యంలో నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.. కాచిగూడ చౌరస్తా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేసి కాచిగూడ టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. ఇక, విఠల్‌వాడి చౌరస్తా (రాంకోఠి నుంచి) నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రాంకోఠి కూడలి వైపు మళ్లింపు.. రాజ్‌మోహల్లా నుంచి వచ్చే వాహనాలు సాబూ షాప్ పాయింట్ నుంచి రాంకోఠి చౌరస్తా మీదుగా మళ్లింపు.. నారాయణగూడ రెడ్డి మహిళా కాలేజ్ నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పుర వైపు మళ్లింపు. బర్కత్‌పుర పాత పోస్టాఫీసు కూడలి నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను అనుమతి లేదు.. క్రౌన్ కెఫే లేదా లింగంపల్లి వైపు మళ్లిస్తారు.. పాత ఎక్సైజ్ ఆఫీసు లేన్ నుంచి వైఎంసీఏ వైపు వాహనాలు విఠల్‌వాడి వైపు మళ్లింపు.. బర్కత్‌పుర చమన్ నుంచి వైఎంసీఏ వైపు రాకపోకలు బంద్ చేసిన అధికారులు.. బర్కత్‌పుర చౌరస్తా వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు.. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి మహిళా కళాశాల వైపు వాహనాలు నారాయణగూడ చౌరస్తా వైపు మళ్లిస్తారు. ఇక, సదర్ ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇద్దరు ఏసీపీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఎస్సైలు, 200 మందికిపైగా కానిస్టేబుళ్లతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక, సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యాదవులు సిద్ధం అయ్యారు.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నలను తీసుకొచ్చి సిద్ధం చేస్తున్నారు.
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!