ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించారు.. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో.. దీంతో.. కొత్త సీఎస్‌గా సమీర్ శర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈనెల 30న ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయనుండగా.. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు సమీర్ శర్మ.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు. […]
దొంగతనం చేసిన వారిని పట్టుకునే పోలీసులే దొంగతనం చేశారు. అవును మీరు వింటున్నది నిజమే. చిత్తూరు జిల్లాలో పోలీసులు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఓ ఏఎస్ఐ చేతివాటం చూపించాడు.. అదీ రోడ్డుపక్కనన ఉన్న ఓ చిన్న దుకాణంలో. రాత్రిళ్లు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాపులోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు.. ఆ దృశ్యాలు సీసీ కె మెరాలో రికార్డు అయ్యాయి. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి […]
పార్టీ ఫిరాయింపు దారులను బీజేపీ ప్రొత్సాహిస్తుందని అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్ తన అధ్యయనంలో వెల్లడించింది. 2014 నుంచి 21 మధ్య దేశ వ్యాప్తంగా 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ పార్టీల నుంచి కాషాయ కండువా కప్పుకునట్లు తెలిపింది. అంతేగాక వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్ధులు బీజేపీ తీర్థం పుచుకున్నట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. గత ఏడేళ్లలో పార్టీ ఫిరాయింపులతో అత్యధికంగా బీజేపీ లాభపడగా, ఎక్కువగా నష్టపోయిన పార్టీగా […]
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను కలవరానికి గురిచేశాయి.. అయితే, ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా కొనసాగనుంది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశమున్నందున నేటి నుంచి 17వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. […]
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా. ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్ వివేకా కేసులో ఇవాళ ఉదయం నుంచి ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు… దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. […]
తాలిబన్లకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాదు.. పలు సందర్భాల్లో ఆడవాళ్లపై వాళ్ల వైఖరిని బయటపెట్టేస్తూనే ఉంటారు.. అయితే, తాలిబన్ల ప్రభుత్వంలోనూ తమకు ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, మహిళలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలన్నారు. మహిళలు ఎప్పటికీ మంత్రులు కాలేరని… తమ ప్రభుత్వంలో చోటు కల్పించమనన్నారు తాలిబన్లు. ఆయుధాలతో ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆది నుంచి మహిళలనే టార్గెట్ […]
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్ము కాశ్మీర్ పర్యనటకు వెళ్లారు. ఇవాళ కటారాకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత.. అక్కణ్నుంచి కాలినడకన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో భక్తులతో కాస్సేపు ముచ్చటించారు రాహుల్. మొత్తం 14 కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లారు రాహుల్.. అమ్మవారి దర్శించుకోవడానికే వచ్చినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వైష్ణోదేవి పరిసరాలకు చేరుకున్న రాహుల్ గాంధీ.. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇది పూర్తిగా రాహుల్ వ్యక్తిగత యాత్రనీ పార్టీ వర్గాలు […]
టీమిండియాను కరోనా వేంటాడుతోంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు టీమిండియా సహాయక బృందంలో మరొకరికి కరోనా వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్‌తో ప్రారంభయ్యే చివరి ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. మరోవైపు టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు […]
తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 315 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 340 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,786 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,891కు పెరిగింది.. […]