టాలీవడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది.. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ప్రశ్నించారు ఈడీ అధికారులు.. మనీల్యాండరింగ్‌కు సంబంధించిన విషయంలో దర్యాప్తు బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతడిని ఎక్సైజ్ ప్రత్యేక బృందం విచారించడంతో కెల్విన్ పేరు తెరపైకి వచ్చింది.. వీరి ఇద్దరినీ విచారించడంతో.. టాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ వినియోగం బటపడింది. […]
పండుగల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓనమ్ పండుగ తర్వాతే కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభించాయని గుర్తుచేశారు… కరోనా నిబంధనలు పాటించాలని అలాంటి పరిస్థితి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పలుచోట్ల కోవిడ్ పాజిటివిటీ రేటు 13శాతం ఉందని గుర్తుచేసిన మంత్రి.. వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనేది […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది… టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనుండగా.. ఇప్పటికే టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.. ఇక, కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఖరారు చేశారని.. రేపోమాపో అధికారికంగా ఆమె […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… రాష్ట్రంలో మటన్ మార్ట్ ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది… ఆరోగ్యకరమైన మాంసం వినియోగం పెంచటమే లక్ష్యంగా మార్ట్ లు ఏర్పాటు చేయనుంది.. తొలి దశలో విశాఖ, విజయవాడల్లో నాలుగు చొప్పున ఈ మార్ట్లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఏపీ సర్కార్.. ఆ తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. రూ.11.20 కోట్లతో 112 మార్ట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.. పరిశుభ్రమైన వాతావరణంలో రిటైల్ […]
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.. ప్రతిపక్షాల నేతలే కుండా హిందూ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.. కొన్ని ప్రాంతాల్లో నిరసన, మౌన దీక్షలు సైతం చేపట్టారు. అయితే, వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.. వినాయక చవితి ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ప్రకాష్ రాజ్ ప్యానల్ గుడ్‌బై చెప్పిన గణేష్.. ఆ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితను టార్గెట్ చేశారు.. ఆమెపైనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రకటించాడు.. ఇక, జీవిత రాజశేఖర్-చిరంజీవి ఫ్యామిలీ పాత గొడవలతో పాటు.. జీవిత పలు పార్టీలో మారంటూ కామెంట్లు చేశాడు బండ్ల గణేష్.. మా ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు.. బండ్ల గణేష్ విమర్శలపై […]
మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన బండ్ల గణేష్.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్‌కు షాక్ ఇచ్చారు.. ప్యానల్ నుంచి బయటకు వచ్చి మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. జీవిత రాజశేఖర్.. ప్రకాష్ రాజ్ ప్యానల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్న బండ్ల.. అందుకే ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి కాక రేపారు.. జీవితపైనే తాను పోటీ చేస్తానని వెల్లడించారు.. ఆమె మెగా […]
జైలు అంటేనే పటిష్టమైన భద్రత ఉంటుంది.. ఇక, ఇజ్రాయెల్ లాంటి దేశంలో అయితే మరింత పకడ్బంది చర్యలు ఉంటాయి.. కానీ, ఒక స్పూన్ సహాయంతో జైలు నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు.. స్పూన్ సహాయంతో జైలు నుంచి సొరంగాన్ని తవ్వారు.. ఆ తర్వాత ఒక సాధారణ ఖైదీ సహా.. ఐదుగురు ఇస్లామిక్ జిహాదీలు జైలు నుంచి పరారయ్యారు. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ జైళ్ల శాఖ కమిషనర్ కేటీ పెర్రీ కూడా అంగీకరించారు.. పారిపోయిన ఖైదీలంతో ఒకే సెల్లో […]
2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే కీలక రాజకీయ మార్పులు జరిగాయి… ఇప్పుడు.. ఆ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు కాగా.. మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.. బేబీ రాణి మౌర్య.. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపినట్టు రాజ్‌భవన్ అధికారి తెలిపారు.. అయితే, ఆమె వ్యక్తిగత కారణాలతోనే […]
తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీల నియామకం తర్వాత తొలిసారి హస్తినబాట పట్టారు నేతలు.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన టి. కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు హాజరయ్యారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ […]