నవంబర్ 30, మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వృత్తుల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది.
వృషభం: ఈ రోజు మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి.
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
- Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
- Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
మిథునం: ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. చేపట్టిన పనుల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. స్త్రీలకు దైవకార్యాలు, ఉపవాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
కర్కాటకం: ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధు మిత్రుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో హామీలు ఉండటం క్షేమదాయకం కాదని గమనించండి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాల పైనే మీ ఆలోచనలుంటాయి.
సింహం: ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. కోర్టు వ్యవహరాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
కన్య: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు అవార్డు వంటి శుభఫలితాలుంటాయి. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
తుల: ఈ రోజు ఈ రాశివారు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
వృశ్చికం: ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
ధనస్సు: ఈ రోజు ఈ రాశిలోని హోటల్, క్యాటరింగ్ పనివారలు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఖర్చులు పెరగడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభ పరిణామాలున్నాయి.
మకరం: ఈ రోజు ఈ రాశిలోని వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
కుంభం: ఈ రోజు ఈ రాశిలోని ప్రింటింగ్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి చేయు యత్నాలు సత్ఫలితాలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అమాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.
మీనం: ఈ రోజు ఈ రాశిలోని ట్రాన్స్ పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయం వల్ల నిరుత్సాహం కానవస్తుంది. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది.
తాజావార్తలు
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!