తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా. ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్ వివేకా కేసులో ఇవాళ ఉదయం నుంచి ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు… దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. […]
తాలిబన్లకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాదు.. పలు సందర్భాల్లో ఆడవాళ్లపై వాళ్ల వైఖరిని బయటపెట్టేస్తూనే ఉంటారు.. అయితే, తాలిబన్ల ప్రభుత్వంలోనూ తమకు ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, మహిళలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలన్నారు. మహిళలు ఎప్పటికీ మంత్రులు కాలేరని… తమ ప్రభుత్వంలో చోటు కల్పించమనన్నారు తాలిబన్లు. ఆయుధాలతో ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆది నుంచి మహిళలనే టార్గెట్ […]
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జమ్ము కాశ్మీర్ పర్యనటకు వెళ్లారు. ఇవాళ కటారాకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత.. అక్కణ్నుంచి కాలినడకన వైష్ణో దేవి యాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో భక్తులతో కాస్సేపు ముచ్చటించారు రాహుల్. మొత్తం 14 కిలోమీటర్ల దూరం కాలినడక వెళ్లారు రాహుల్.. అమ్మవారి దర్శించుకోవడానికే వచ్చినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వైష్ణోదేవి పరిసరాలకు చేరుకున్న రాహుల్ గాంధీ.. రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇది పూర్తిగా రాహుల్ వ్యక్తిగత యాత్రనీ పార్టీ వర్గాలు […]
టీమిండియాను కరోనా వేంటాడుతోంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు టీమిండియా సహాయక బృందంలో మరొకరికి కరోనా వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్‌తో ప్రారంభయ్యే చివరి ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. మరోవైపు టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు […]
తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 315 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 340 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,786 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,891కు పెరిగింది.. […]
కరోనా మహమ్మారి కారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు పొడిగిస్తూనే వస్తోంది ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.. గతంలో సీబీడీటీ ప్రకటించిన తేదీ ప్రకారం డెడ్‌లైన్ సెప్టెంబర్ 30 వరకు ఉండగా.. ఇవాళ ఆ తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సాధారణ జూలై 31, 2021 వరకే ఉంది.. అయితే, కొత్త ఆదాయ […]
క్యాంప్ కార్యాలయంలో సీఎం ఐఎస్ జగన్‌ను కలిశారు రమ్య కుటుంబ సభ్యులు.. జరిగిన ఘటనపై సీఎం జగన్‌ను వివరించారు రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం, ధైర్యాన్ని చెప్పారు.. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు.. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎంతో […]
17 రాష్ట్రలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.. “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” (పీడీఆర్డీ) గ్రాంట్ కింద ఆరో విడత నిధులు విడుదల చేసింది.. దేశంలోని 17 రాష్ట్రాలకు 6వ విడత కింద రూ. 9,871 కోట్లు విడుదలయ్యాయి.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అర్హత కలిగిన రాష్ట్రాలకు “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” గ్రాంట్ కింద రూ. […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి.. ప్యానల్స్ మాత్రమే కాదు.. సింగిల్‌గా కూడా తాము బరిలోకి దిగుతాం అంటున్నారు సినీ సెలబ్రిటీలు.. ఈ మధ్యే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్.. తాను స్వతంత్ర అభ్యర్థిగా జీవితారాజశేఖర్‌పై పోటీచేస్తానని ప్రకటించడం చర్చగా మారింది. ఇక, వ్యక్తిగత విమర్శలు.. వాటికి జీవిత కౌంటర్ ఇవ్వడంతో మా ఎన్నికల ఎపిసోడ్ రసకందాయంగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీ నేత, సీనియర్ నటుడు బాబు మోహన్.. […]
మానుకోట ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. కవితపై గతంలో నమోదైన కేసును కొట్టివేసింది కోర్టు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారంటూ 2019లో కవితపై కేసు నమోదైంది.. ఈ కేసులో విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానాను గతంలో విధించింది.. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు కవిత.. అయితే, ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన […]