కరోనా మహమ్మారి కారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు పొడిగిస్తూనే వస్తోంది ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.. గతంలో సీబీడీటీ ప్రకటించిన తేదీ ప్రకారం డెడ్లైన్ సెప్టెంబర్ 30 వరకు ఉండగా.. ఇవాళ ఆ తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సాధారణ జూలై 31, 2021 వరకే ఉంది.. అయితే, కొత్త ఆదాయ […]
క్యాంప్ కార్యాలయంలో సీఎం ఐఎస్ జగన్ను కలిశారు రమ్య కుటుంబ సభ్యులు.. జరిగిన ఘటనపై సీఎం జగన్ను వివరించారు రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం, ధైర్యాన్ని చెప్పారు.. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు.. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత.. పదిరోజుల్లో ఉద్యోగ నియామకం అయ్యాక సీఎంతో […]
17 రాష్ట్రలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.. “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” (పీడీఆర్డీ) గ్రాంట్ కింద ఆరో విడత నిధులు విడుదల చేసింది.. దేశంలోని 17 రాష్ట్రాలకు 6వ విడత కింద రూ. 9,871 కోట్లు విడుదలయ్యాయి.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అర్హత కలిగిన రాష్ట్రాలకు “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” గ్రాంట్ కింద రూ. […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి.. ప్యానల్స్ మాత్రమే కాదు.. సింగిల్గా కూడా తాము బరిలోకి దిగుతాం అంటున్నారు సినీ సెలబ్రిటీలు.. ఈ మధ్యే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్.. తాను స్వతంత్ర అభ్యర్థిగా జీవితారాజశేఖర్పై పోటీచేస్తానని ప్రకటించడం చర్చగా మారింది. ఇక, వ్యక్తిగత విమర్శలు.. వాటికి జీవిత కౌంటర్ ఇవ్వడంతో మా ఎన్నికల ఎపిసోడ్ రసకందాయంగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీ నేత, సీనియర్ నటుడు బాబు మోహన్.. […]
మానుకోట ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.. కవితపై గతంలో నమోదైన కేసును కొట్టివేసింది కోర్టు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారంటూ 2019లో కవితపై కేసు నమోదైంది.. ఈ కేసులో విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానాను గతంలో విధించింది.. అయితే, ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు కవిత.. అయితే, ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన […]
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో […]
వినాయక ఉత్సవాలు, నిమజ్జనానికి హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ, నిమజ్జనం పై ఆంక్షలు విధించింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావ్.. హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా తమకు అందలేదన్న ఆయన.. ఈ సారి సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.. ఈ నెల 19న సామూహిక నిమజ్జనం ఉంటుందని.. హుస్సేన్ సాగర్ […]
రెండున్నరేళ్ల పాలనలో వైఎస్ జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు… శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్టేషన్ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ విడుదలయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సీఎం జగన్ ప్యాలెస్ దాటి బయటకు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.. తక్షణమే నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు.. ఇక, రెండున్నరేళ్ల పాలనలో జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో […]
216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. క్యాంప్ కార్యాలయంలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్నారు.. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందని తెలిపిన ఆయన.. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందని.. మొదటి త్రైమాసికంలో ఏకంగా 24.43 శాతం […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,856 శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 14 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, గడిచిన 24 గంటల్లో […]