వర్షాల ఎఫెక్ట్‌తో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి… నిన్న మొన్నటి వరకు కిలో టమాటా వందకు పైగా పలకగా… ఇప్పుడు వంకాయ వంతు వచ్చింది.. హోల్‌సెల్ మార్కెల్‌లోనే కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది వంకాయ ధర..
Read Also: నవంబర్ 30, మంగళవారం దినఫలాలు
సోమవారం రోజు ఈ హోల్‌సేల్ మార్కెట్‌లో 10 కిలోల వంకాయలు రూ.1000గా పలికాయి.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వెళ్లేసరికి కిలో రూ.150పైమాటే అని చెబుతున్నారు.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తోటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోవడం ఓ కారణం అయితే.. కార్తీక మాసంలో వంకాయకు డిమాండ్ ఉండడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.. కార్తీక మాసంలో పూజలు, శుభకార్యాలు, అయ్యప్ప పడిపూజలు.. ఇలా అన్నింటికీ వంకాయను వాడుతూ ఉంటారు.. దీనికి పంట దిగుబడి తగ్గిపోవడం తోడు కావడంతో.. వంకాయ ధర అమాంతం పెరిగినట్టు చెబుతున్నారు. మరోవైపు.. కొంత పంట నష్టపోయినా.. మిగిలిన పంటకు మంచి ధర పలకవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు.